రాష్ట్రంలోని మహబూబాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ సోమవారం గిరిజన మహాధర్నాకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మహాధర్నాలో పాల్గొనేందుకు రోడ్డు మార్గంలో మహబూబాబాద్ బయలుదేరారు. దీంతో కేటీఆర్‌కు చిట్యాల వద్ద ఘనస్వాగతం లభించింది. ఆయనకు మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి, నకేరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఇతర మాజీ ఎమ్మెల్యేలు,ప్రజాప్రతినిధులు స్వాగతం పలికారు.
ఆయన కారు విండో వద్ద స్టాండింగ్‌లో ఉండి కేడర్‌కు కరచాలనం చేశారు. కొడంగల్‌లోని లగచర్లలో గిరిజన రైతులపై జరిగిన దాడిని నిరసిస్తూ బీఆర్ఎస్ మహాధర్నాకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ ధర్నా ద్వారా గిరిజనులకు భరోసా కల్పించి వారికి దగ్గర అయ్యేందుకు బీఆర్ఎస్ యత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ మహాధర్నా వేదికగా రేవంత్ ప్రభుత్వాన్ని కేటీఆర్ నిలదీస్తారని సమాచారం.