ఆదానీ – రేవంత్‌ మధ్య 12,400 కోట్ల ఒప్పందం – కేటీఆర్‌ సంచలనం

-

ఆదానీ – రేవంత్‌ మధ్య 12,400 కోట్ల ఒప్పందం జరిగినట్లు కేటీఆర్‌ సంచలన ఆరోపణలు చేశారు. అదానీ వ్యవహారం అంతర్జాతీయ స్థాయి లో బయట పడిందని… దీనివల్ల బారత దేశ ప్రతిష్ట కు ప్రపంచ వ్యాప్తంగా భంగం కలిగిందని పేర్కొన్నారు. మేము అధికారం లో ఉన్నప్పుడు అదాని ని తెలంగాణ లో అడుగు పెట్టనివ్వలేదని గుర్తు చేశారు. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం 12400 కోట్ల రూపాయల తో అదాని తో ఎంవోయూ చేసుకున్నారని ఆరోపణలు చేశారు.

ktr

రామన్నపేట పేటలో ఆదాని సిమెంట్ పరిశ్రమ వద్దు అని అక్కడి ప్రజలు వద్దు అని చెప్పినా తెచ్చే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ లో కొత్త ఆదాని సామ్రాజ్యాన్ని తెస్తున్నారని ఫైర్‌ అయ్యారు. హై కమాండ్ ఆదేశాలు లేకుండా ఆదాని తో ఈ ఒప్పందాలు జరుగు తున్నాయా చెప్పాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఏ పని జరగాలన్న హైకమాండ్ ఆదేశాలు కావాలన్నారు. చిన్న చిన్న కార్పొరేషన్ పదవులకు హైకమాండ్ ఆజ్ఞ లేనిది ఇవ్వరు.. అలాంటిది హైకమాండ్ ఆదేశాలు లేనిదే అదానీతో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వేల కోట్ల ఒప్పందాలు చేసుకుంటుందా? అని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ ఢిల్లీలో రోజు అదానీని తిడుతాడు, తెలంగాణలో వేల కోట్ల ఒప్పందాలు చేసుకుంటాడని ఆరోపణలు చేశారు కేటీఆర్.

Read more RELATED
Recommended to you

Exit mobile version