జీడిపప్పుతో కుర్మా.. జీరో కొలెస్ట్రాల్‌ హై ప్రొటీన్..!

-

డ్రైనట్స్‌లో జీడిపప్పు అంటే అందరూ ఇష్టంగా తింటారు. టైమ్ పాస్‌కు కూడా అలా నెయ్యిలో వేయించుకుని కాస్త ఉప్పు, కారం వేసి తిన్నా సూపర్‌గా ఉంటాయి. చాలామంది గ్రేవీ కర్రీస్‌లో జీడిపప్పును వాడుతుంటారు. మరి ఏకంగా జీడిపప్పుతోనే కుర్మా చేస్తే..టేస్ట్‌ వీరలెవల్‌..జీడిపప్పు అంటే అందరూ కొలెస్ట్రాల్‌ అనుకుంటారు. ఈ పద్దతిలో చేస్తే జీరో కొలెస్ట్రాల్‌, ఇంకా హెల్తీ కూడా.!

జీడిపప్పు కుర్మా చేయడానికి కావాల్సిన పదార్థాలు..

జీడిపప్పు ఒకటిన్నర కప్పు
టమోటా ముక్కలు రెండు కప్పులు
పచ్చిమిర్చి మూడు
గట్టి పెరుగు ఒక టేబుల్‌ స్పూన్
లెమన్ జ్యూస్‌ ఒక టేబుల్‌ స్పూన్
అల్లం ముక్కలు ఒక టేబుల్‌ స్పూన్
జీలకర్ర ఒక టీ స్పూన్
మిరియాలు ఒక టీ స్పూన్
జిలకర్రపొడి ఒక టీ స్పూన్
యాలుకలు మూడు
లవంగాలు నాలుగు
దాల్చిన చెక్క ముక్క ఒకటి
ఇంగువ పొడి కొద్దిగా
కొత్తిమీర కొద్దిగా

తయారు చేసే విధానం..

నాన్‌స్టిక్‌ పాత్ర తీసుకుని పొయ్యిమీద పెట్టి దాల్చినచెక్క ముక్క, లవంగాలు, యాలుకలు, మిరియాలు, జీడిపప్పు అరకప్పు, అల్లం ముక్కలు, టమోటా ముక్కలు ఒక కప్పు వేసి మెల్లగా తిప్పుకోండి, పచ్చిమిరపకాయలు వేసి పది నిమిషాలు ఉంచి..చల్లారక మిక్సీజార్‌లో వేసుకుని గ్రైండ్‌ చేయండి. ఇంకో పాత్ర పొయ్యిమీద పెట్టి అందులో మిగిలిన జీడిపప్పు మీగడ వేసి వేగనివ్వండి. పక్కనపెట్టుకోండి. కుర్మా చేసుకోవడానికి వీలుగా కాస్త లోతుగా ఉన్న పాత్ర తీసుకుని పొయ్యి మీద పెట్టి అందులో మీగడ వేసి జీలకర్ర, ఇంగువ పొడి, పసుపు వేసి కొద్దిగా వేడెక్కిన తర్వాత మిగిలిన టమోటా ముక్కలు, జీలకర్ర పొడి వేసి కలిపేసి ఐదు నిమిషాలు మూత పెట్టి ఉంచండి. అలా మగ్గిన తర్వాత అందులో నిమ్మరసం వేయండి. వేయించుకున్న జీడిపప్పు, గ్రైండ్‌ చేసుకున్న గ్రేవీ వేసి 5-7 నిమిషాలు ఉంచండి. ఫైనల్‌గా గట్టిపెరుగు ఒక టేబుల్‌ స్పూన్, కొత్తిమీర వేయండి. అంతే ఎంతో రుచిగా ఉంటే జీడిపప్పు కుర్మా రెడీ.!పుల్కాలు, రోటీలు, చపాతీల్లోకి సూపర్‌ ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version