క‌రోనా నుంచి కోలుకుంటున్న గాయ‌ని ల‌తా మంగేష్క‌ర్

-

సీనియ‌ర్ గాయ‌ని ల‌తా మంగేష్క‌ర్ కు క‌రోనా సోకిన విష‌యం తెలిసిందే. దీంతో ల‌తా మంగేష్క‌ర్ ఈ నెల 11 వ తేదీన ఆస్ప‌త్రిలో చేరింది. తాజా గా ల‌తా మంగేష్క‌ర్ ఆరోగ్య పరిస్థితిపై మ‌హా రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్ టోపే కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ల‌తా మంగేష్క‌ర్ ఆరోగ్యం ప్ర‌స్తుతం నిల‌క‌డ‌గా ఉంద‌ని అన్నారు. ప్ర‌స్తుతం లతా మంగేష్క‌ర్ క‌రోనా నుంచి కోలుకుంటున్నార‌ని ప్ర‌క‌టించారు. ఈ రోజు ఆయ‌న ల‌తా మంగేష్క‌ర్ ను క‌లిసిన అనంత‌రం మీడియా తో మాట్లాడారు.

వైద్యులతో కూడా మాట్లాడిన‌ట్టు మంత్రి తెలిపారు. అలాగే ల‌తా మంగేష్క‌ర్ కుటుంబ స‌భ్యుల‌తో కూడా ఆరోగ్య ప‌రిస్థితి పై చ‌ర్చించిన‌ట్టు వెల్ల‌డించారు. త్వ‌ర‌లోనే ల‌తా మంగేష్క‌ర్ పూర్తి గా కోలుకుంటార‌ని తెలిపారు. కాగ‌ కరోనా సోకిన నాటి నుంచి ల‌తా మంగేష్క‌ర్ ఆరోగ్యం విష‌మం గా ఉంది. ఈ నెల 11 నుంచి ల‌తా మంగేష్క‌ర్ ఐసీయూ లోనే ఉంటుంది. కాగ ప్ర‌స్తుతం లతా మంగేష్క‌ర్ ఆరోగ్య ప‌రిస్థితి మెరుగు ప‌డుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version