చంద్రబాబును అరెస్ట్ చేసిన సిఐడి పోలీసులు ఇతనిపై పెట్టిన సెషన్ లలో 17 A ను చేర్చలేదు. ఈ సెక్షన్ పైన తాజాగా చంద్రబాబు నాయుడుకు లాయర్ గా వ్యవహరిస్తున్న హరీష్ సాల్వే కీలక విషయాలు వెల్లడించారు. ఇక ఈ విషయాన్ని హై కోర్ట్ లో వాదించారు సాల్వే… 2018 చట్ట సవరణ తర్వాత రిజిస్టర్ అయిన ప్రతి ఎఫ్ ఐ ఆర్ కు సెక్షన్ 17A (అవినీతి నిరోధక చట్టం) వర్తిస్తుందని తెలిపారు. నేరం ఎప్పుడు జరిగిన విషయాన్ని మాత్రం ఈదృష్టిలో పెట్టుకుని మాత్రమే ఎఫ్ ఐ ఆర్ ను రికార్డ్ చేయాలని, అరెస్ట్ చేసే సమయాన్ని కాదంటూ హరీష్ సాల్వే కోర్టుకు చెప్పుకున్నారు. అప్పుడు చంద్రబాబు సీఎం గా ఉన్నారు కాబట్టి.. ఆయన్ను అరెస్ట్ చేయాలంటే ఖచ్చితంగా గవర్నర్ అనుమతి తీసుకోవాలంటూ హరీష్ సాల్వే హై కోర్ట్ కు తెలియచేశారు.
అంతే కానీ అరెస్ట్ చేసే సమయంలో ఆయన పదవిలో లేరు కాబట్టి గవర్నర్ అనుమతి తీసుకోవడం అవసరం లేదని అనడం కరెక్ట్ కాదంటూ తమ వాదన వినిపించారు హరీష్ సాల్వే.