LeEco S1pro: ఐఫోన్‌ లాంటి ఫోన్‌ను లాంచ్‌ చేసిన చైనా కంపెనీ..!

-

ఐఫోన్‌ వాడాలాని చాలామంది అనుకుంటారు.. కానీ ఆ కాస్ట్‌ భరించలేక ఆండ్రాయిడ్‌తోనే సరిపెట్టుకుంటారు.. ఐఫోన్‌ అనేది ఒక ఎడిక్షన్‌ లాంటిదే.. ఆపిల్‌ కంపెనీ ప్రొడెక్ట్స్‌ ఏం వాడినా సరే..వాటికి ఎడిక్ట్‌ అయిపోతాం.. ఐఫోన్‌ వాడిన ఎవరూ కూడా మళ్లీ ఆండ్రాయిడ్‌ వాడలేరు. మ్యాక్‌బుక్‌ కూడా అంతే..అందులో ఉన్నంత కంఫర్ట్‌ వారికి వేరే కంపెనీ ప్రొడెక్ట్స్‌లో కనిపించదు.. కానీ ఇప్పుడు మార్కెట్‌లోకి ఒక ఫోన్‌ వచ్చింది.. దీని లుక్‌ అచ్చం ఐఫోన్‌ లానే ఉంది.. చూస్తే ఎవరైనా అది ఐఫోన్‌ అనే అనుకుంటారాట..!

చైనా కంపెనీ ఐఫోన్ లాంటి ఓ స్మార్ట్ ఫోన్‌ను తీసుకువచ్చింది. LeEco అనే చైనీస్ బ్రాండ్ LeEco S1 ప్రో ఫోన్‌ను లాంఛ్ చేసింది. ఇది చూడడానికిని ఐఫోన్ 14 ప్రో లాగే ఉంటుంది.. అయితే ధర మాత్రం చాలా తక్కువ. LeEco S1 Proని చైనాలో దాదాపు రూ. 10,900కి విక్రయించనున్నారు. ఈ ఫోన్ స్పెసిఫికేషన్లను ఓ సారి పరిశీలిస్తే ఇది 8GB RAM, 128GB స్టోరేజ్ సామర్థ్యం ఉంది..

స్పెసిఫికేషన్లలో ఎంత తేడా?

ఐఫోన్ తో పోల్చితే ఈ ఫోన్ హార్డ్‌వేర్ పరంగా చాలా భిన్నంగా ఉంటుంది. దీంతో LeEco S1 Pro సరసమైన ధరలో లభిస్తుంది. ఈ ఫోన్‌లో 6.5-అంగుళాల LCD డిస్ప్లే ఇవ్వబడింది

ఐఫోన్ 14 ప్రోలో 6.1-అంగుళాల OLED డిస్ప్లే అందుబాటులో ఉంది. HD+ (720×1600 పిక్సెల్స్) రిజల్యూషన్ LeEco S1 ప్రోలో అందుబాటులో ఉంది. ఐఫోన్‌లో హై-ఎండ్ 4K కంటెంట్‌ను చూడవచ్చు

LeEco S1 Pro 60Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి. iPhone 14 Pro 120Hzతో పరిచయం చేయబడింది.

LeEco S1 ప్రో మూడు బ్యాక్ కెమెరాలను కలిగి ఉంది. ఫోన్ వెనుక భాగంలో 13-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, ముందు భాగంలో 5-మెగాపిక్సెల్ స్నాపర్ ఉంది.

ఇది కాకుండా, 10W ఛార్జింగ్ సపోర్ట్‌తో ఫోన్‌లో 5,000mAh బ్యాటరీ ఇచ్చారు…ఇది iPhone 14 Pro 20W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. తక్కువ కాస్ట్‌లో కాస్ట్లీ లుక్‌ ఇచ్చే ఫోన్‌ అనమాట ఇది..

Read more RELATED
Recommended to you

Exit mobile version