ఎల్‌ఐసీ నుండి సూపర్ ప్లాన్.. 12 ఏళ్లు చెల్లిస్తే…. 20 ఏళ్ల వరకు బీమా కవరేజీ… పూర్తి వివరాలు ఇవే..!

-

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎల్ఐసీ ఎన్నో కొత్త కొత్త పాలసీలని తీసుకు వచ్చింది. తాజాగా మరో సరి కొత్త జీవిత బీమా పాలసీని కూడా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇక మరి మనం ఈ పాలసీ కి సంబంధించి పూర్తి వివరాలను చూసేద్దాం. ఎల్‌ఐసీ జీవన్ ఆజాద్ లిమిటెడ్ పీరియడ్ పేమెంట్ ఎండోమెంట్ ప్లాన్ ఇది. దీని వలన కలిగే లాభాలు మొదలు పూర్తి వివరాలని ఇప్పుడు చూద్దాం.

ఎల్‌ఐసీ జీవన్ ఆజాద్ లిమిటెడ్ పీరియడ్ పేమెంట్ ఎండోమెంట్ ప్లాన్:

ఈ ప్లాన్ ని తీసుకుంటే వ్యక్తి మరణిస్తే అతడి కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని ఇస్తారు. మెచ్యూరిటీ వరకు జీవించి ఉంటే గ్యారెంటీ ఇచ్చిన మొత్తాన్ని ఒకసారి చెల్లిస్తారు.
అదే ఒకవేళ మెచ్యూరిటీ వరకు జీవించి ఉంటే గ్యారెంటీ ఇచ్చిన మొత్తాన్ని ఒకేసారి ఇస్తారు. పాలిసీ ని బట్టీ లోన్ వస్తుంది.

జీవన్ ఆజాద్ జీవిత బీమా పాలసీ అర్హత:

ఈ జీవన్ ఆజాద్ జీవిత బీమా పాలసీ తీసుకోవాలంటే కనీస వయసు 90 రోజుల నుంచి గరిష్ఠంగా 50 ఏళ్లు.
కనిష్ఠంగా సమ్ అష్యూర్డ్ రూ.2 లక్షల నుంచి గరిష్ఠంగా రూ.5 లక్షలుగా నిర్ణయించడం జరిగింది.
జీవన్ ఆజాద్ పాలసీ కాల వ్యవధి 15 నుంచి 20 ఏళ్ల వరకు సెలెక్ట్ చేసుకోవచ్చు.
ఈ పాలసీ ప్రీమియం వచ్చేసి ఏడాది, ఆరు, మూడు నెలలతో పాటు నెల నెల చెల్లించవచ్చు.
20 ఏళ్ల పాలసీ టర్మ్ తీసుకుంటే 8 ఏళ్లు మినహాయించి మిగిలిన 12 ఏళ్లు ప్రీమియం పే చెయ్యాలి. డెత్ బెనిఫిట్స్ ని కూడా పొందవచ్చు.
బేసిక్ సమ్ అష్యూర్డ్ లేదా వార్షిక ప్రీమియం కంటే 7 రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఎలాంటి వైద్య పరీక్షలు లేకుండానే రూ.3 లక్షల దాకా సమ్ అష్యూర్డ్‌ తో ప్లాన్ తీసుకోవచ్చు. అయితే రూ.3 లక్షలకు పైగా సమ్ అష్యూర్డ్ కావాలంటే మెడికల్ ఎగ్జామినేషన్ సర్టిఫికెట్ ని సబ్మిట్ చెయ్యాల్సి వుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version