‘లైక్ షేర్ & సబ్ స్క్రైబ్’ OTT రిలీజ్ డేట్ ఫిక్స్

-

టాలీవుడ్ హీరో సంతోష్ శోభన్, జాతి రత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా నటించిన చిత్రం ” లైక్ షేర్ సబ్స్క్రైబ్”. విభిన్న కథలను ఎంచుకుంటూ తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు నటుడు సంతోష్ శోభన్. ” గోల్కొండ హై స్కూల్” చిత్రంతో గౌతమ్ గా కెరియర్ ని ప్రారంభించాడు సంతోష్. ” తను నేను” అనే చిత్రంతో హీరోగా పరిచయమయ్యాడు.

మొదటి నుండి అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ రిలీజ్ తర్వాత మాత్రం ఆశించిన స్థాయి సక్సెస్ ని అందుకోలేకపోయింది. అయితే విషయం ఏమిటంటే, ఈ మూవీని డిసెంబర్ 9న ప్రముఖ ఓటీటీ మాధ్యమం సోని లివ్ ద్వారా బుల్లితెర ఆడియన్స్ ముందుకు రానుంది. కొద్దిసేపటి క్రితం ఈ విషయమై అధికారిక ప్రకటన వచ్చింది. మరి థియేటర్స్ లో పెద్దగా ఆకట్టుకోలేని లైక్ షేర్ & సబ్ స్క్రైబ్ మూవీ ఓటిటిలో ఎంత మేరకు మెప్పిస్తుందో చూడాలని అంటున్నారు సినీ విశ్లేషకులు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version