పాత లిక్కర్ కేసులో వైసీపీ ఎంపీ.. జైలు తప్పదా ?

-

ఈ మధ్య కాలంలో ప్రజాప్రతినిధుల మీద ఉన్న అన్ని కేసులను తేల్చే పనిలో న్యాయవ్యవస్థ ఉందన్న సంగతి తెలిసిందే. చిన్న కేసు, పెద్ద కేసు అనే తేడా లేకుండా దాదాపు అన్ని కేసులు తేల్చే పనిలో ఉంది. ఇప్పటికే చిన్నాచితకా కేసులు, అనిపిస్తే వాటిని కొట్టేస్తున్నారు. అయితే ఓటుకు నోటు…లిక్కర్ స్కాం లాంటి పెద్ద కేసుల్లో మాత్రం అభియోగాల నమోదు, సాక్ష్యాల నమోదు చేపడుతున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో జరిగిన లిక్కర్ స్కాంలో సాక్ష్యాలను ప్రజాప్రతినిధుల కోర్టు నమోదు చేసిన కారణంగా ఏపీలో కొంత మంది నేతల్లో టెన్షన్ మొదలైనట్టు చెబుతున్నారు. ఎందుకంటే ఈ లిక్కర్ స్కాంలో నిందితుడిగా ఉన్నది వైసీపీ మాజీ మంత్రి, ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు ఎంపీ మోపిదేవి వెంకట రమణ.

మోపిదేవి పై మద్యం సిండికేట్ల నుంచి లంచం పుచ్చుకున్న మరో కేసు కూడా విచారణలో ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ఉన్న సమయంలో కరీంనగర్ లో ఈ వ్యవహారం బయటపడటంతో రాష్ట్ర వ్యాప్తంగా ఏసీబీ దాడులకు అప్పటి సీఎం కిరణ్ ఆదేశించారు. అప్పటి ఎక్సైజ్ శాఖ మంత్రి మోపిదేవి వెంకట రమణారావు మద్యం సిండికేట్ల పంచాయతీ తీర్చి పది లక్షల రూపాయల లంచం తీసుకున్నారని ఒక నిందితుడు వాంగ్మూలం ఇచ్చారు.

అప్పట్లో ఈ అంశం మీదనే ఏసీబీ అధికారులు  మోపిదేవిని  ప్రశ్నించారు కూడా. అయితే ఈ స్కాంలో వీవీసి మోటార్స్ వంకాయలపాటి రాజేంద్రప్రసాద్ A3గా ఉన్నారు. ఇప్పుడు ఈ కేసులో ఉన్న అందరికీ శిక్ష తప్పేలా లేదని అనుకుంటున్నారు. ప్రస్తుతానికి విచారణ అయితే పదిహేనో తేదీకి వాయిదా పడింది. పదిహేనో తేదీ తర్వాత ఈ కేసు విచారణ కీలక దశకు చేరుకునే అవకాశం ఉందని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరగనుందో ?  

Read more RELATED
Recommended to you

Exit mobile version