కరోనా మహమ్మారి దేశంలో రోజు రోజుకు విస్తరిస్తోంది. ముఖ్యంగా కేరళ, మహారాష్ట్ర మరియు కర్ణాటక రాష్ట్రాల్లో ఈ వైరస్ తాకిడి ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలోనే కర్ణాటక రాష్ట్రంలో లాక్ డౌన్ ఇస్తారని వార్తలు వస్తున్నాయి. కరోనా కట్టడికి ఆగస్టు 15 నుంచి… లాక్ డౌన్ పెట్టే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు వార్తలు వినిపించాయి.
అయితే ఈ లాక్ డౌన్ వార్తలపై తాజాగా…. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. కర్ణాటక రాష్ట్రంలో లాక్ డౌన్ విధించే ఆలోచన తమకు లేదంటూ… ఆగస్టు 15 నుంచి లాక్ డౌన్ విధిస్తున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని క్లారిటీ ఇచ్చింది సర్కార్. అలాగే నైట్ కర్ఫ్యూ ఆలోచన కూడా తమకు లేదంటూ పేర్కొంది కర్ణాటక ప్రభుత్వం. రాష్ట్రంలో మరియు ముఖ్యంగా బెంగళూరు లో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తుందని ఆరోగ్య శాఖ పేర్కొంది. ఈ సమయంలో లాక్ డౌన్ విధిస్తే… ప్రజలకు చాలా ఇబ్బంది కలుగుతుందని వెల్లడించింది కర్ణాటక ప్రభుత్వం.