నిజామాబాద్ లో లవర్స్ సుసైడ్ : వారం రోజులుగా చెట్టుపైనే మృతదేహాలు

-

తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఆ జిల్లాలోని చందూర్ మండలం లక్ష్మాపూర్ అడవి ప్రాంతంలో ఓ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. చెట్టుకుని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు ప్రేమికులు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. విషయం తెలిసిన పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. అంతేకాదు.. మోస్రామ్ మండలం తిమ్మాపూర్ కి చెందిన మోహన్,లక్ష్మి గా వారిని గుర్తించారు పోలీసులు. మృతురాలు లక్ష్మికి ఆరునెలల క్రితమే వేరే వ్యక్తిలో కుటుంబ సభ్యులు వివాహం చేశారు.

అయితే వీళ్ళ ప్రేమ వ్యవహారం భర్తకు పది రోజుల క్రితం తెలియడంతో ఇరు కుటుంబాల మధ్య గొడవ అయినట్లు సమాచారం. దీంతో ఆ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ జంట వారం రోజుల క్రితమే ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం అందుతోంది. అటు వారం నుండి చెట్లకి వేలాడుతూ మృతదేహాలు ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version