విషాదం : మద్యంలో పురుగుల మందు, ప్రేమికుల సూసైడ్ !

సంగారెడ్డిలోని నార్సింగ్ లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. అక్కడ 2 రోజుల క్రితం ఇద్దరు ప్రేమికులు ఆత్మహత్యాయత్నం చేశారు. అయితే ఆ ఇద్దరూ నిన్న ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట ప్రాంతానికి చెందిన ప్రశాంత్, పార్వతి ఇద్దరూ శనివారం సాయంత్రం నార్సింగ్ మంచిరేవుల ప్రాంతంలో మద్యం లో పురుగుల మందు కలుపుకొని తాగి ఆత్మహత్యాయత్నం చేశారు.

suicidethinkphotos
suicidethinkphotos

అనంతరం ప్రశాంత్ తన స్నేహితుడికి ఫోన్ చేసి తాము పురుగుల మందు తాగాము అని, కానీ తమకు ఇప్పుడు బ్రతకాలని ఉందని,  తమను ఆస్పత్రికి తరలించాలని ఫోన్ చేసి కోరాడు. దీంతో హుహాహుటిన సంఘటనా స్థలానికి వెళ్ళిన స్నేహితుడు ఆ ఇద్దరినీ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆ ఇద్దరూ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందారు. ఈ ఘటనపై నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అయితే తమ ప్రేమను ఇంట్లో వాళ్ళకి చెప్పే ధైర్యం లేకనే, ఇలా చనిపోవాలని అనుకున్నారని భావిస్తున్నారు. కానీ పోలీసుల దర్యాప్తులో మాత్రం ఎటువంటి అంశాలు వెలుగులోకి రాలేదు.