ఇప్పుడు ప్రతి ఒక్కరూ బిజినెస్ పై ఆసక్తి చూపిస్తున్నారు..చేస్తున్న ఉద్యోగాలతో వచ్చే జీతాలు సరిపోక కాస్త పెట్టుబడి తో కూడిన బిజినెస్ చేస్తున్నారు. ఇప్పటికే ఎన్నో బిజినెస్ అందుబాటులో ఉన్నాయి.. అయితే తక్కువ పెట్టుబడి తో ఎక్కువ లాభాలను తెచ్చి పెట్టె బిజినెస్ లు కొన్నే ఉన్నాయి. అందులో ఒకటి పల్లె నుంచి పట్టణం వరకు అంతటా డిమాండ్ ఉంటుంది. కరోనా తర్వాత చాలా మంది ఆరోగ్యంపై దృష్టి సారించారు. పోషకాహారం కోసం బాగా ఖర్చు పెడుతున్నారు. అందువల్ల పోషకాహర పిండి వ్యాపారం చేస్తే.. భారీగా లాభాలు వస్తాయి. తక్కువ పెట్టుబడితోనే దీనిని మరు ప్రారంభించవచ్చు. నెలనెలా పెద్ద మొత్తంలో ఆదాయం మీకు వస్తుంది. పోషకాహార పిండి ఆరోగ్యానికి చాలా మంచిది.ఈ పిండి తో ఎన్నో రకాల వంటలను చేసుకోవచ్చు.
ఈ పిండి తయారి కోసం ముందుగా పోషకాహర పిండి తయారీ కోసం ముందుగా సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీస్ రీసర్చ్ ఇన్‌స్టిట్యూట్-మైసూర్, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్ మేనేజ్‌మెంట్-కుండలి నుంచి అనుమతి తీసుకోవాలి. దానితో పాటుగా ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ రిజిస్ట్రేషన్ అవసరం. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి లైసెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ పూర్తైన తర్వాతే వ్యాపారం మొదలు పెట్టాలి…బిజినెస్ మొదలు పెట్టక ముందే ఇవ్వన్నీ చట్ట బద్దంగా క్లియర్ చేసుకోవాలి.
ఇకపోతే ఈ పిండిని తయారు చెయ్యడానికి 30 నుంచి 40 రూపాయలు ఖర్చు అవుతుంది. మార్కెట్ లో కిలో 60 రుపాయలకు అమ్మవచ్చు.. అన్నీ ఖర్చుల పొగా 10 రూపాయలు మిగులుతుంది.. ఎలా లేదనుకున్నా కూడా నెలకు 45 నుంచి 50 వేలు మిగులుతాయి..దీనికి సొంతంగా స్థలం వుంటే ఇంకాస్త డబ్బులు ఆదా అవుతాయి..మీకు ఈ ఆలోచన ఉంటే మీరు కూడా బిజినెస్ చేసి మంచి లాభాలను పొందవచ్చు..