“మా” అసోసియేషన్ అధ్యక్ష ఎన్నికల తేదీ ఖరారు!

-

టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో సినిమా షూటింగ్ ల కంటే… మా అసోసియేషన్ అధ్యక్ష ఎన్నికలే హాట్ టాపిక్ గా మారాయి. ఈ మా అధ్యక్ష ఎన్నికల నోటిఫికేషన్ రాక ముందే… టాలీవుడ్ చిత్ర పరిశ్రమ లో వివాదాలు కూడా తెరపైకి వచ్చాయి. ఇక ఎన్నడూ లేని విధంగా ఈసారి ఐదుగురు అభ్యర్థులు అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నారు.

అలాగే ఈ ఎన్నికల్లో ఒకరి పై ఒకరు మాటల యుద్ధంగా కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో మా అధ్యక్ష ఎన్నిక తేదీ పై క్లారిటీ వచ్చింది. అక్టోబర్ 10 వ తేదీన ఈ మా అసోసియేషన్ అధ్యక్ష ఎన్నికలను నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతోంది. అక్టోబర్ 10వ తేదీ లోపు కరోనా కేసులు కూడా అదుపులోకి వస్తాయన్న నేపథ్యంలో…. ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఎన్నికల తేదీలను మరికాసేపట్లో ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా నటుడు నరేష్ మరియు నటి హేమ మధ్య వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే

Read more RELATED
Recommended to you

Exit mobile version