MAA ELECTIONS : ఆలింగనం చేసుకున్న విష్ణు ప్రకాష్ రాజ్..!

-

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల కోసం జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్ లో ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ రోజు రాత్రి 8 గంటల లోపు ఫలితాలు కూడా విడుదలయ్యే అవకాశం ఉంది. అధ్యక్ష పదవి కోసం ప్రకాష్ రాజ్ మంచు విష్ణు పోటీలో ఉన్న సంగతి తెలిసిందే. ఇక మంచు విష్ణు తన ప్యానల్ సభ్యులతో పాటు ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యులు కూడా పబ్లిక్ స్కూల్ వద్దకు చేరుకున్నారు.

మంచు విష్ణు తో పాటు మోహన్ బాబు పోలింగ్ కేంద్రం వద్ద సందడి చేశారు. ఈ సందర్భంగా ప్రకాష్ మోహన్ బాబు కరచాలనం చేసుకున్నారు. అనంతరం ప్రకాష్ రాజ్ మోహన్ బాబు ఆశీర్వాదం తీసుకున్నారు. ఆ తర్వాత విష్ణుతో మోహన్ బాబు ప్రకాష్ రాజ్ కు కరచాలనం చేయించారు. విష్ణు ప్రకాష్ రాజ్ కూడా ఆలింగనం చేసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version