సీజ్ చేసిన ఇసుక ట్రాక్టర్ కోసం స్టేషన్ కి సీఎల్పీ లీడర్..అసలేం జరిగిందంటే…!

-

పోలీస్ స్టేషన్ లో ఇసుక పంచాయతీ.. స్టేషన్ లో సీజ్ చేసిన కాంగ్రెస్ ట్రాక్టర్ టైర్ దగ్దం. దగ్దం అయిన ట్రాక్టర్ ను పోలీసులే హుటా హుటిన బాగు చేయించడం..తన కార్యకర్త కోసం సాక్షాత్తు సిఎల్పీ నేత భట్టి విక్రమార్క పోలీసు స్టేషన్ వెళ్లాల్సిన అసవరం ఏమొచ్చింది…

ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని ముదిగొండ పోలీసు స్టేషన్ కు తీసుకుని వచ్చిన ట్రాక్టర్ లలో కాంగ్రెస్ కార్యకర్తల ట్రాక్టర్ టైర్ దగ్దం అయ్యింది. ఇది పెద్ద వివాదంగా మారిపోయింది. మండలంలోని గంధసిరి గ్రామంలో ఇసుక యదేచ్చ రవాణా సాగుతుంటుంది. అక్కడ ఇంటికి ఒక్క ట్రాక్టర్ ఉంటుంది. ఆ ట్రాక్టర్ యజమానులు అంతా ఇసుక వ్యాపారమే చేస్తుంటారు. పక్కనే ఉన్న మున్నేరు నుంచి ఇసుక యదేచ్చగా రవాణా చేస్తుంటారు. అయితే మున్నేరు లో ఇసుక ర్యాంపు లేదు. అనదికారికంగా ఇసుక రవాణా సాగుతుంటుంది. పోలీసులు కూడా చూసి చూడనట్లు ట్రాక్టర్ లను సీజ్ చేసి కేసులు అడపా దడపా పెడుతుంటారు. అంత వరకు బాగానే ఉంది.

తాజాగా కొద్ది రోజుల క్రితం ఒక్క సారిగా ముప్పై ట్రాక్టర్ లను పోలీసులు పట్టుకుని ముదిగొండ పోలీసు స్టేషన్ లో పెట్టారు. అయితే ఇందులో ఉన్న ట్రాక్టర్ లలో కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి ట్రాక్టర్ టైర్ దగ్దం అయ్యింది. ఇది పెద్ద ఇష్యూగా మారడంతో సిఎల్పీ నేత భట్టి విక్రమార్క ఏకంగా ముదిగొండ పోలీసు స్టేషన్ కువచ్చారు. ట్రాక్టర్ లు అన్నింటిని పరిశీలించారు. ఎందుకు ఇలా జరిగిందని పోలీసులను ప్రశ్నించారు. ఏదైన నియోజకవర్గంలో ఇసుక అక్రమ రవాణ వ్యవహారంలో పోలీసులు ఒక్క పార్టీ కి అనుకూలంగా వ్యవహరిస్తున్న తీరు తెన్నులు వివాదస్పదంగా మారుతున్నాయంట. కాంగ్రెస్ కార్యకర్తల ఫిర్యాదుతో భట్టీ స్టేషన్ కి రావడం విషయం ముదురుతుందనుకున్న పోలీసులే స్వయంగా తగలబడిన ట్రాక్టర్ బాగు చేయించడం ఇప్పుడు మధిర నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారిందంట..

Read more RELATED
Recommended to you

Latest news