మ్యాజిక్ రైస్: బియ్యాన్ని కనీసం వేడి చేయకుండానే అన్నం రెడీ

-

సాధారణంగా అన్నం వండాలంటే అయితే పొయ్యి మీదో.. లేకపోతే రైస్ కుక్కర్ లో అయినా వండాలి.కానీ కరీంనగర్ జిల్లాలో ఓ రైతు పండించిన బియ్యం అందరిని ఆశ్చర్యపరుస్తోంది. పొయ్యి ముట్టించనవసరం లేదు. బియ్యం ఉడికించాల్సిన పని లేదు… ఇవేం లేకుండానే అన్నం రెడీ అవుతోంది. ఈ సీక్రెట్ ఏంటో తెలుసుకోవాలంటే కరీంనగర్ శ్రీరాముల పల్లి రైతు శ్రీకాంత్ ని కలవాల్సిందే…

వరి సాగులో అనేక రకాలు ఉన్నాయి..దొడ్డు రకం,సన్నరకం ఇలా మరిన్ని రకాలు ఉన్నాయి. కానీ వాటన్నిటికంటే భిన్నంగా మనం చూస్తున్న ఈ బియ్యం ఉంటాయి. అసలు బియ్యాన్ని కనీసం వేడి చేయకుండానే రెడీ అయిపోతుందంటే ఆశ్చర్యం అవుతుంది.. బియ్యం అన్నంగా మారాలంటే…పోయ్యి వెలిగించి…బియ్యాన్ని ఉడికించాలని అందరికి తెలుసు. కానీ, బియ్యాన్ని నాన బెడితే అన్నంగా మారుతుంది. ఇది ఎలా అవుతుందో ఎవరికి అంతు పట్టదు. అదే ఈ రైస్ ప్రత్యేకత.. ఇందులో మాయ, మంత్రం లేదు. కనికట్టు అసలు లేదు. కేవలం బియ్యాన్ని ఓ గిన్నెలో వేసి, తగినంత నీరు పోస్తే…20నిమిషాల్లో అన్నంగా మారుతుంది. అదే ఈ మ్యూజిక్ రైస్ స్పెషాలిటీ.

కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలం శ్రీ రాములపల్లి గ్రామానికి చెందిన శ్రీకాంత్ , మొదటిసారి సాగు చేస్తున్న వరి రకం ఇది. అసోంలో కోమల్ తాల్ అని పిలిచే ఈ రకం వరిని , శ్రీకాంత్ సేకరించి ప్రయోగాత్మకంగా సాగు చేస్తున్నాడు. పూర్తిగా ప్రకృతి సేద్యం పద్దతిలో సాగు చేసిన ఈ పంట, కోతకు వచ్చింది. పేరులో ఉన్నట్లుగానే ఈ రకం మ్యాజిక్ చేస్తుంది.

ఈ సరికొత్త వరి రకాన్ని ఇప్పుడిప్పుడే శాస్త్రవేత్తలు అభివృద్ధి చేస్తున్నారు. ఈ రకంలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు 160 రోజుల్లో పంట చేతికి అందుతుంది.ఉడికించిన అన్నం కంటే, ఈ అన్నం రుచిగా ఉంటుందంటున్నాడు రైతు శ్రీకాంత్. అసోం లో మ్యాజిక్ రైస్,బ్లాక్ రైస్ తో సహా అనేక రకాలు పండిస్తున్నారు. ఇలాంటి నూతన విధానం ద్వారా రైతులకు గిట్టుబాటు అవుతుందని, ప్రజలకు నాణ్యమైన పోషక విలువలు అందుబాటులోకి వస్తాయంటున్నాడు శ్రీకాంత్.

Read more RELATED
Recommended to you

Exit mobile version