ప్రయాగ్ రాజ్ లో మహా కుంభమేళా..ప్రారంభమైంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుకకు లక్షలాదిగా తరలివస్తున్నారు భక్తులు. త్రివేణి సంగమంలో భక్తుల పుణ్యస్నానాలు చేస్తున్నారు. నేటి నుంచి ఫిబ్రవరి 26 వరకు మహా కుంభమేళా జరుగనుంది. మహాకుంభ్ కోసం దాదాపు రూ. 7 వేల కోట్లతో ఏర్పాట్లు చేసింది యూపీ ప్రభుత్వం.
45 రోజుల పాటు జరిగే మహాకుంభమేళాకు 45 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేసిన యోగి సర్కార్….మహాకుంభ్ కోసం దాదాపు రూ. 7 వేల కోట్లతో ఏర్పాట్లు చేసింది. దేశ నలుమూలల నుంచే కాకుండా విదేశీ పౌరులు కూడా పుణ్య స్నానాలు చేస్తున్నారు. సాధువులు లక్షలాదిగా తరలివస్తున్నారు.
మహా కుంభమేళా.. ప్రత్యేకతలు ఇవే
* జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు మహా కుంభమేళా *మహా కుంభమేళా 2025కు 40 కోట్ల మంది వస్తారని అంచనా *అతిపెద్ద మానవ సమావేశం ఇదే అవుతుందని అంచనా *భక్తుల భద్రత కోసం పడవల వినియోగం *వాహనాల రాకపోకలకు విస్తృత ప్రణాళిక *నీటి అడుగున డ్రోన్‌లు ఏర్పాటు *ఆకాశంలో డ్రోన్ల నుంచి సునిశిత పరిశీలన *ఏఐ సామర్థ్యంతో పనిచేసే 2,500 కెమెరాల ఏర్పాటు *భక్తుల కోసం 1,50,000 గుడారాలు ఏర్పాటు