ఎన్ కౌంటర్ బూటకం… తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది- గడ్చిరోలి ఎన్ కౌంటర్ పై మావోయిస్ట్ పార్టీ

-

మావోయిస్టు పార్టీకి భారీ ఎదురు దెబ్బ తగిలింది. శనివారం ఉదయం మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా ధనోరా తాలూకా గ్యారబట్టి అటవీ ప్రాంతంలో భీకర ఎన్ కౌంటర్ జరగింది. ఈ ఎన్ కౌంటర్ లో 26 మంది మావోయిస్టులు మరణించిన సంగతి తెలిసిందే. ఈ మధ్యకాలంలో ఒకేసారి ఇంతమంది మావోలు చనిపోవడం ఇదే ప్రథమం. మావోయిస్టు పార్టీ అత్యంత పటిష్టంగా ఉండే గడ్చిరోలి లోనే ఇంత పెద్ద ఎన్ కౌంటర్ జరగడం ఆ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బగా చెప్పవచ్చు.

తాజాగా గ్యారబట్టి ఎన్ కౌంటర్ పై మావోయిస్టు పార్టీ స్పందించింది. ఈ ఎన్ కౌంటర్ పై పూర్తిస్థాయి విచారణ చేయాలని డిమాండ్ చేసింది. ఎన్ కౌంటర్ బూటకమని మావోయిస్టు పార్టీ పేర్కొంది. పోలీసులే ఇన్ఫార్మర్ వ్యవస్థను పెంచిపోషిస్తుందని విమర్శించింది. అమాయక ప్రజలకు డబ్బుల ఆశ చూపి మావోయిస్టులను ఎన్ కౌంటర్ చేస్తున్నారని పోలీసులను విమర్శించింది. తెలంగాణ, మహారాష్ట్ర, చత్తీస్ఘడ్ రాష్ట్రాల సమన్వయంతోనే ఎన్ కౌంటర్ చేశారని మావోయిస్టు పార్టీ ఆరోపించింది. ఎన్ కౌంటర్ కు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చిరించింది మావోయిస్టు పార్టీ.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version