లెక్కించలేని ప్రేమతో మహాసముద్రం.. పోస్టర్ అదిరింది..

-

శర్వానంద్ హీరోగా ఆర్ ఎక్స్100 దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వంలో మహాసముద్రం అనే టైటిల్ తో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సిద్ధార్థ్ మరో హీరోగా కనిపిస్తున్న ఈ సినిమాలో అదితీ రావ్, అనూ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా కనిపిస్తున్నారు. ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ చిత్రానికి రామబ్రహ్మం సుంకర్ నిర్మాతగా ఉన్నారు. నేడు దీపావళి సందర్భంగా ఈ చిత్ర మొషన్ పోస్టర్ రిలీజైంది.

లెక్కించలేని ప్రేమకథ గా రూపొందుతున్న మహాసముద్రం పోస్టర్, చాలా ఆసక్తి రేపుతుంది. బ్యాగౌండ్లో ఎరుపెక్కిన సముద్రం, ఒక గట్టున ప్రేమ పక్షులు.. వారు నిల్చున్న వద్ద నుండి తుపాకీ అటు పక్క చూపుతున్నట్లు దృశ్యం.. మరో పక్క వారి నుండి దూరంగా వెళ్తున్న వ్యక్తి. మొత్తానికి సినిమా ఏదో మంచి కంటెంట్ తో వస్తుందని అర్థం అవుతుంది. మరి అజయ్ భూపతి మహాసముద్రంతో ఏం చేస్తాడో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version