Pavitra Naresh Marriage : నరేష్ – పవిత్ర లోకేష్ ల ‘మళ్లీ పెళ్లి’కి ఏర్పాట్లు పూర్తి..

-

ఎట్టకేలకు సీనియర్ నటుడు నరేష్ మరో సీనియర్ నటి పవిత్ర లోకేష్ ను తాజాగా పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. అనేక ట్విస్ట్ ల మధ్య ఈ ప్రేమ పక్షులు పెళ్లి బంధంతో ఒక్కటి అయ్యారు. సన్నిహితులు కుటుంబ సభ్యుల సమక్షంలో వీరి వివాహం మైసూర్ లోనే జరిగినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారాయి.

తనకు పవిత్ర లోకేష్ తో వివాహమైనట్లు నరేష్ ఆ పెళ్లి వీడియోను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నాడు. అయితే… ఆ వీడియో మళ్లీ పెళ్లి అనే సినిమా కోసమేనని తేలింది. ఇక తాజాగా ఈ సినిమాపై ఓ వీడియోను రిలీజ్‌ చేశారు. విజయ కృష్ణ మూవీస్ బ్యానర్ పై తెలుగు-కన్నడ ద్విభాషా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే తాజాగా సినిమా టైటిల్ ను, ఫస్ట్ లుక్ పోస్టర్ ను, గ్లింప్స్ ను అలాగే రిలీజ్ పైనా అప్డేట్ అందించా రు మేకర్స్. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు, నిర్మాత ఎంఎస్ రాజు కథ అందించడంతో పాటు డైరెక్ట్ చే శారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version