మమతా బెనర్జీ నాకెంతో సన్నిహితురాలు: సౌరవ్ గంగూలీ

-

కేంద్ర హోంమంత్రి అమిత్ షా కోల్కతాలో బిసిసిఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ నివాసంలో డిన్నర్ చేయడం తెలిసిందే. ఈ విందు వ్యవహారం రాజకీయ పరంగా చర్చకు దారి తీసింది. ఈ నేపథ్యంలో గంగోలి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.నిన్న కోల్కతా లో ఓ ప్రైవేటు ఆసుపత్రి ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాట్లాడుతూ.. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తనకు ఎంతో సన్నిహితురాలు అని వెల్లడించారు. ఈ ఆసుపత్రి నిర్మించాలని ఉన్న డాక్టర్ ని సీఎం వద్దకు తీసుకెళ్లానని, ఆమె వెంటనే స్పందించి సహాయ సహకారాలు అందించారని గంగూలీ వెల్లడించారు.

గంగూలి నివాసానికి వెళ్లిన నేపథ్యంలో, దాదా త్వరలోనే రాజకీయాల్లోకి వస్తున్నారంటూ ఊహాగానాలు బయలుదేరాయి. అమీషా పర్యటన నేపథ్యంలో గంగూలి అప్పుడే వివరణ ఇచ్చారు. అమిత్ షా తో తనకు 2008 నుంచి పరిచయం ఉందని వెల్లడించారు. ఇప్పుడు ఆయన కుమారుడు( జై ష- బిసిసిఐ కార్యదర్శి) తో పని చేస్తున్నా అని తెలిపారు. ఇక గంగూలి ఇంటికి అమిత్ షా వస్తున్న సంగతి పై సీఎం మమతా బెనర్జీ కూడా మొన్ననే స్పందించారు. అతిథులను ఇంటికి పిలవడం బెంగాలీ ప్రజల సంస్కృతి అని పేర్కొన్నారు. “సౌరవ్ ఇంటికి హోంమంత్రి వస్తే ఏమైనా అరిష్టమా? హోంమంత్రికి ‘మిష్టి దోయి ‘( సుప్రసిద్ధ బెంగాలీ వంటకం) వడ్డించాలని సౌరవ్ కు చెబుతాను” అంటూ దీదీ అమిత్ షా పర్యటనను తేలిగ్గా తీసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version