ముస్లిం బాయ్ ఫుడ్ తెచ్చాడని ఆర్డర్ క్యాన్సిల్ చేశాడతను.. గట్టిగా జవాబిచ్చిన జొమాటో..!

-

అమిత్ శుక్లా అనే వ్యక్తి జొమాటోలో ఫుడ్ ఆర్డర్ చేశాడు. అయితే అతనికి ఆ ఫుడ్‌ను ఓ ముస్లిం డెలివరీ బాయ్ ఇంటికి తెచ్చి ఇచ్చాడు. ఈ క్రమంలో తనకు ఫుడ్ డెలివరీ చేసింది ఒక ముస్లిం వ్యక్తి అని తెలుసుకున్న అమిత్ శుక్లా వెంటనే ఆ ఆర్డర్‌ను క్యాన్సిల్ చేశాడు.

అన్ని రంగాల్లోనూ టెక్నాలజీ పరంగా దేశం ఎంతో ముందుకు దూసుకెళ్తున్నా.. కొందరు మాత్రం ఇంకా కులాలు, మతాల పేరుతో జనాలపై వివక్ష చూపిస్తున్నారు. మానవ సమాజం మనుగడకు ఇవేవీ అవసరం కాదని తెలిసినా.. ఇంకా కొందరు కులం, మతం అంటూ అక్కడే పాత రాతియుగంలోనే ఉండిపోతున్నారు. ఈ క్రమంలోనే ఓ వ్యక్తి ఇలాగే మరొక వ్యక్తిపై మతపరమైన వివక్ష చూపాడు. దీంతో ఆ మత వివక్ష చూపిన వ్యక్తి పట్ల నెటిజన్లు ఇప్పుడు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే…

ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్.. జొమాటో తెలుసు కదా. అందులో ఇటీవలే అమిత్ శుక్లా అనే వ్యక్తి ఫుడ్ ఆర్డర్ చేశాడు. అయితే అతనికి ఆ ఫుడ్‌ను ఓ ముస్లిం డెలివరీ బాయ్ ఇంటికి తెచ్చి ఇచ్చాడు. ఈ క్రమంలో తనకు ఫుడ్ డెలివరీ చేసింది ఒక ముస్లిం వ్యక్తి అని తెలుసుకున్న అమిత్ శుక్లా వెంటనే ఆ ఆర్డర్‌ను క్యాన్సిల్ చేశాడు. అంతేకాదు.. ముస్లిం వ్యక్తులు డెలివరీ చేసే ఫుడ్ తనకు అక్కర్లేదని ఏకంగా జొమాటోకు ట్వీట్ చేశాడు.

అయితే అమిత్ శుక్లా ట్వీట్‌కు అటు జొమాటో కూడా ఘాటుగానే స్పందించింది. ఫుడ్‌కు మతం అంటూ ఏదీ ఉండదని, జొమాటోలో అందరినీ సమానంగానే చూస్తామని సమాధానం ఇచ్చింది. దీంతో జొమాటో చొరవను నెటిజన్లు అభినందిస్తున్నారు. 21వ శతాబ్దంలోనూ ఇంకా కులం, మతం పట్టుకుని వేళ్లాడే కొందరికి ఇలాగే బుద్ధి చెప్పాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అవును మరి.. నిజంగానే ఆహారానికి మతం ఉండదు కదా. మన కడుపు నింపడమే దానికి తెలుసు. అందులోనూ కులం, మతం అని పట్టుకుని కూర్చుంటే సరికాదు కదా..!

Read more RELATED
Recommended to you

Exit mobile version