ఎక్కడికి వెళ్ళిన సెల్ఫి దిగటం ఈ మధ్య కాలంలో సర్వ సాధారణంగా మారిపోయింది.కొన్ని సెల్ఫీలని చూస్తే మన కళ్ళని మనమే నమ్మలేనంత వింతవిగా ఉంటాయి. మరికొన్ని సెల్ఫీలు ఎంతో భయాని గొల్పుతూ ఉంటాయి. ఇక సెల్ఫీల కారణంగా ప్రాణాలు పోగొట్టుకుంటున్న వారి సంఖ్య గురించి చెప్పనవసరం లేదు. సింహాలు, పులుల మధ్య సెల్ఫిలు దిగుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం పరిపాటి అయ్యింది.
ఈ కొవక చెందినవాడే జార్డ్. ఇతగాడు ఏకంగా ప్రపంచంలోనే అతిపెద్ద అనకొండ అయిన గ్రీన్ అనకొండతో సెల్ఫీ దిగి సంచలనం సృష్టించాడు. అంతేకాదు అతడు సుమారు 40 నిమిషాల పాటు ఆ గ్రీన్ అనకొండ మధ్య గడిపి అందరిని ఆశ్చర్యపరిచాడు. 35 ఏళ్ళ జార్జ్ మెక్సికో లోని ఓ అడ్వెంచర్ ట్రావెల్ కంపెనీని నిర్వహిస్తున్నాడు. ఇప్పటి వరకూ ఎన్నో సాహస యాత్రలు చేసిన జార్జ్ కి ఉన్న ఏకైక కోరిక…
ప్రపంచంలోనే అతిపెద్ద పాముగా పిలువబడే గ్రీన్ అనకొండని దగ్గరగా చూడటం. దాంతో కాసేపు సరదాగా గడపడం. అనుకున్నదే తడవుగా అతడు బ్రెజిల్ లోని ఫోర్మోసో రివర్ లో గ్రీన్ అనకొండ ఉండే ప్రాంతానికి వెళ్లి అక్కడ అనకొండతో సెల్ఫీ లు దిగుతూ తన అనుభవాన్ని పంచుకుంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దాంతో ఆ ఫోటోలు వైరల్ అవడమే కాకుండా నెటిజన్ల నుంచీ ప్రశంసలు అందుకున్నాడు.