మధ్యప్రదేశ్లో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. బాలికపై అత్యాచారం చేసిన యువకుడు బాధితురాలి ఫిర్యాదుతో జైలుకు వెళ్లాడు. ఆమెపై కోపం పెంచుకున్న నిందితుడు పగ తీర్చుకోవాలని వేచిచూశాడు. ఏడాది తర్వాత బెయిల్పై బయటకు వచ్చిన నిందితుడు మళ్లీ ఆ బాలికపై అత్యాచారం చేశాడు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు అదనపు ఎస్పీ వివేక్ లాల్ తెలిపారు. శనివారం రోజున నిందిడుని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.
అసలేం జరిగిందంటే.. మధ్యప్రదేశ్లోని రీవా జిల్లాలోని ఖాత్ఖరీ ప్రాంతానికి చెందిన.. 26 ఏళ్ల నిందితుడు గత సంవత్సరం బాలికపై అత్యాచారం చేసినందుకు సెప్టెంబర్ 23న అరెస్ట్ అయ్యాడు. నిందితుడు కొద్దిరోజుల క్రితం బెయిల్పై బయటకు వచ్చి మళ్లీ అదే బాలికపై అత్యాచారం చేశాడు. గత శుక్రవారం ఇంటి పనిమీద బయటకు వెళ్లిన బాలికను నిందితుడు అపహరించి.. ఎవరూ లేని ప్రాంతానికి తీసుకుపోయి బెదిరించి మరీ అత్యాచారం జరిపాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. శనివారం నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.