సమ్మర్ స్పెషల్: ఇలా ఈజీగా ఐస్ క్రీం మ్యాంగో షేక్ చేసేయండి…!

-

వేసవి కాలం లో చల్లటి పదార్థాలు తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది. పైగా మామిడి పళ్ళు కూడా మనకి దొరుకుతుంటాయి. కాబట్టి ఈ రెసిపీ చేయడానికి అదే సరైన సమయం.

 

ఐస్ క్రీం మ్యాంగో షేక్ చేయడానికి పెద్దగా శ్రమించక్కర్లేదు. తక్కువ సమయం లోనే మనం దీనిని ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. మరి ఇక ఆలస్యం ఎందుకు ఇప్పుడే ఈజీగా ఐస్ క్రీం మ్యాంగో షేక్ రెసిపీని చూసేయండి.

ఐస్ క్రీం మ్యాంగో షేక్ కి కావాల్సిన పదార్ధాలు:

ఒక కప్పు ఫ్రెష్ క్రీమ్
రెండు స్పూన్లు పంచదార
4 స్కూప్స్ వెనీలా ఐస్ క్రీం
ఐసు ముక్కలు
కొద్దిగా యాలుకల పొడి

ఐస్ క్రీం మ్యాంగో షేక్ తయారు చేసుకునే విధానం:

దీని కోసం మీరు ముందుగా మామిడి పండ్లు తీసుకోండి. వాటిని తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇప్పుడు ఈ ముక్కల్ని తీసుకుని దానిలో క్రీమ్, పంచదార పొడి, యాలుకల పొడి వేయండి. వీటిని అంతా కూడా మిక్సీ లో వేసి బ్లెండ్ చేయండి.

ఇప్పుడు మీరు నాలుగు గ్లాసులు తీసుకుని మ్యాంగో షేక్ ని వాటిలో వెయ్యండి. పైన ఒక స్కూప్ ఐస్ క్రీమ్ తీసుకొని గ్లాసులోని పెట్టండి. పైన మామిడి పళ్ళు ముక్కలు వేసుకుని సర్వ్ చేసుకోండి అంతే. చాలా సింపుల్ గా ఈ ఐస్ క్రీం మ్యాంగో షేక్ తయారు చేసుకోవచ్చు. పైగా పిల్లలు కూడా దీనిని తాగడానికి ఇష్ట పడుతూ ఉంటారు. వేసవిలో ఎండలు ఎక్కువగా ఉంటాయి కనుక దీనిని తీసుకుంటే వెంటనే ఉపశమనం లభిస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version