రోడ్డు విస్తరణ పనుల కోసం మాజీ మంత్రి జానారెడ్డి ఇంటికి మార్కింగ్..!

-

హైదరాబాద్ నగరంలో ఇప్పటికే హైడ్రా పలు అక్రమ కట్టడాలను కూల్చివేసిన విషయం తెలిసిందే. తాజాగా ట్రాఫిక్ కి అడ్డంకిగా ఉన్న కొన్ని నిర్మాణాలను కూల్చివేయాలని ట్రాఫిక్ అధికారులు భావించారు. అయితే రోడ్డు విస్తరణ పనుల కోసం మాజీ మంత్రి జానారెడ్డి ఇంటికి మార్కింగ్ పెట్టారు. దీంతో ” నా ఇంటికే మార్కింగ్ వేస్తారా.. స్థలం ఇచ్చేదేలేదు ” అంటున్నారు కాంగ్రెస్ నేత జానారెడ్డి.

Jana Reddy

“నా ఇంటికే టెండర్ వేస్తారా..? సీఎంతో మాట్లాడతా.. ఎన్నో ప్రభుత్వాలను చూశా.. నా ఇంటి స్థలం ఇచ్చే ప్రసక్తే లేదు” అంటూ తన ఇంటి వద్ద మార్కింగ్ చేసేందుకు వెళ్లిన అధికారులపై మండిపడ్డారు మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి. ఆయనతో పాటు నటుడు, ఏపీకి చెందిన టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. హైదరాబాద్లోని కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు ఫ్లై ఓవర్లు, అండర్ పాసులు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో టెండర్ల దశలోనే వివాదాస్పదంగా మారడంతో.. ప్రభుత్వ యంత్రాంగానికి  భూసేకరణ సవాల్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version