Breaking : కాంగ్రెస్‌ నుంచి మర్రి శశిధర్‌ రెడ్డి బహిష్కరణ

-

మర్రి శశిధర్‌పై కాంగ్రెస్ అధిష్టానం బహిష్కరణ వేటు వేసింది. నిన్న ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను మర్రి శశిధర్‌రెడ్డి కలవడంతో..ఆయనపై పార్టీ అధిష్టానం చర్యలు తీసుకుంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారన్న ఆరోపణల నేపథ్యంలో ఆయనపై కాంగ్రెస్ పార్టీ బహిష్కరణ వేటు వేస్తూ నిర్ణయం తీసుకుంది. దాదాపు ఆరేళ్లపాటు పార్టీ నుంచి బహిష్కరిస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. నిన్న ఢిల్లీలో అమిత్‌షాను కలిసిన మర్రి శశిధర్‌రెడ్డి ఆ తర్వాత మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి క్యాన్సర్ వ్యాధి సోకిందని అనుచిత వ్యాఖ్యలు చేయడం తీవ్ర దుమారం రేపింది.

దీంతో ఆయనపై క్రమశిక్షణా సంఘం నోటీసులు కూడా జారీ చేసింది. ఇదిలా ఉంటే.. అమిత్‌ షాతో భేటీ అనంతరం మర్రి శశిధర్‌ రెడ్డి కాంగ్రెస్‌ పార్టీతో పాటు రేవంత్‌ రెడ్డిపై విమర్శలు చేశారు. ‘రేవంత్ రెడ్డి వ్యవహారశైలి అసలు బాగాలేదు. ఒక హోం గార్డు పార్టీ నుంచి పోతే పోయేదేమీ లేదు. టీఆర్ఎస్‌ను ఎదుర్కొనే పరిస్థితి కాంగ్రెస్‌కు లేదు. చెంచాగాళ్లతో పార్టీని నడిపిస్తున్నారు. రేవంత్ రెడ్డికి పీసీసీ పదవి ఇవ్వొద్దని నేను కూడా చెప్పా. మునుగోడులో ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు. నాలాగే చాలామంది కాంగ్రెస్ పార్టీని వీడుతారు’ అని రేవంత్ తీరుపై తీవ్ర విమర్శలు చేశారు శశిధర్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version