రవితేజతో యాక్షన్ మోడ్ లో మాస్ డైరెక్టర్..!

-

మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించిన రీసెంట్ యాక్షన్ చిత్రం ‘ఈగల్’ మూవీతో టాలీవుడ్ ఆడియెన్స్ ని పలకరించిన విషయం విధితమే.   ఈ సినిమా తర్వాత రవితేజ మరిన్ని చిత్రాలతో బిజీగా ఉండగా.. వాటిలో స్టార్ అండ్ మాస్ దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్ లో చేస్తున్న ‘మిస్టర్ బచ్చన్’ కూడా ఒకటి.

బాలీవుడ్ హిట్ మూవీ ‘రైడ్’ కి రీమేక్ గా హరీష్  మార్పులతో తెరకెక్కిస్తున్న ఈ చిత్రం పట్ల మంచి బజ్ క్రియేట్ అయింది.  ఈ చిత్రం కోసం అంతా ఎదురు చూస్తుండగా.. తాజాగా దర్శకుడు హరీష్ శంకర్ సాలిడ్ అప్డేట్ ని అందించాడు. ప్రస్తుతం సినిమా యాక్షన్ బ్లాక్ లు తెరకెక్కిస్తున్నట్టుగా తాను సెట్స్ నుంచి ఫొటోతో అప్డేట్ ని అందించాడు. రీసెంట్ గానే ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ తో హరీష్ అదిరే ట్రీట్ ని ఇచ్చిన సంగతి తెలిసిందే.  దీని తర్వాత వెంటనే మిస్టర్ బచ్చన్ లో జాయిన్ అయ్యాడు. ఇక ఈ చిత్రంలో రవితేజ సరసన భాగ్యశ్రీ నటిస్తుండగా మిక్కి జె మేయర్ సంగీతం అందిస్తున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news