ట్రంప్ కు షాక్ ఇచ్చిన మేయర్…!

-

చరిత్రలో ఎన్నడు లేని విధంగా అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ ఇప్పుడు భద్రతా వలయంలో ఉంది. అక్కడ పటిష్ట చర్యలను ఏర్పాటు చేస్తున్నారు. ఇటీవల జార్జ్ ఫ్లాయిడ్ మృతితో సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అమెరికాలో కరోనాతో ప్రభుత్వం ఇబ్బంది పడుతున్న వేళ పోలీసులు చేసిన ఈ చర్యపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇక అక్కడ రోజు రోజుకి ఆందోళనలు తీవ్రంగా జరుగుతున్నాయి.

ఈ నేపధ్యంలోనే అధికారులు చర్యలను పక్కాగా చేపడుతున్నారు. నిర‌స‌న‌కారులు ఏకంగా వైట్ హౌస్ ని టార్గెట్ చేసిన నేపధ్యంలో జాగ్రత్తలు పడుతున్నారు. ఇదిలా ఉంటే అమెరికా అధ్యక్షుడు ఆర్మీని దింపే అవకాశం ఉందని నిరసన కారులను తీవ్రంగా హెచ్చరించారు. ఈ నేపధ్యంలో ఆర్మీ మొహ‌రింపు వ్యాఖ్య‌ల‌ను సీరియస్ గా తీసుకున్న వాషింగ్ట‌న్ డీసీ మేయ‌ర్ మురియెల్ బౌసర్ తనదైన రీతిలో అసహనం వ్యక్తంచేశారు.

సైనిక చ‌ర్య‌ల‌తో న‌ల్ల‌జాతీయుల‌ను అణ‌గ‌దొక్కాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు. వైట్‌హౌస్‌కు వెళ్లే ర‌హ‌దారిపై ‘బ్లాక్ లైవ్స్ మేటర్’ అంటూ పెద్ద పెద్ద అక్ష‌రాల‌తో పెయింటింగ్ వేయించారు ఆయన. మేయ‌ర్ నియమించిన‌ వాలంటీర్లు స్ట్రీట్ 16లో శుక్ర‌వారం ఈ 16 అక్ష‌రాల పెయింటింగ్ వేయడం గమనార్హం. అక్కడితో ఆగలేదు ఆయన… వైట్‌హౌస్ ముందు ఉన్న ఒక వీధికి “బ్లాక్ లైవ్స్ మేటర్ ప్లాజా” అనే పేరు కూడా పెట్టారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version