Medigadda: కేసీఆర్, హరీష్ రావులకు హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ కుంగుబాటు కేసులో కేసీఆర్, హరీష్ రావులకు హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఈ తరుణంలోనే… భూపాలపల్లి జిల్లా కోర్టు ఇచ్చిన నోటీసులను సస్పెండ్ చేసింది తెలంగాణ హైకోర్టు. అటు ఫిర్యాదు దారుడికి నోటీసులు జారీ చేసింది తెలంగాణ రాష్ట్ర హై కోర్టు. విచారణ వచ్చే నెల 7 వ తేదీకి వాయిదా వేసింది.
కాగా.. ఇటీవలే మేడిగడ్డ కుంగుబాటు పై కెసిఆర్, హరీష్ రావు లకు నోటీసులు జారీ చేసింది భూపాలపల్లి జిల్లా కోర్టు. మేడిగడ్డ నిర్మాణంలో అవినీతి జరిగిందన్న అంశంపై భూపాలపల్లి కోర్టు నోటీసులు ఇచ్చింది.
అయితే.. ఆ నోటీసులను కేసీఆర్, హరీష్ రావులు చేసి.. తెలంగాణ రాష్ట్ర హై కోర్టుకు వెళ్లారు. దీంతో కేసీఆర్, హరీష్ రావులకు హైకోర్టులో భారీ ఊరట లభించింది.