‘ఆచార్య’ అట్టర్ ఫ్లాప్.. ఆ ఒక్కటే బాధగా ఉంది : చిరంజీవి

-

‘గాడ్‌ఫాదర్‌’ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి. ఈ ప్రమోషన్స్ లో భాగంగా చిరంజీవి బాలీవుడ్ మీడియాకు ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో ఆచార్య సినిమా ఫ్లాప్ అవ్వడంపై చిరు స్పందించారు.

‘‘కెరీర్‌ ప్రారంభమైన కొత్తలో విజయం వచ్చినప్పుడు బాగా ఆనందించేవాడిని. పరాజయం వస్తే బాధపడేవాడిని. కానీ ఆ రోజులు గడిచిపోయాయి. మొదటి 15 సంవత్సరాల్లోనే ఎన్నో ఎదుర్కొన్నాను. మానసికంగా, శారీరకంగా అన్నింటినీ తట్టుకోవడం తెలుసుకున్నాను. నటుడిగా పరిణతి చెందిన తర్వాత సినిమా పరాజయాలు నన్నెప్పుడూ బాధపెట్టలేదు. విజయాన్ని తలకెక్కించుకోలేదు’’

‘‘సినిమా ఫలితం ఎప్పుడూ మన చేతుల్లో ఉండదు. మన పనిలో మనం బెస్ట్‌ ఇస్తామంతే. ‘ఆచార్య’ పరాజయం నన్నస్సలు బాధించలేదు. ఎందుకంటే దర్శకుడు చెప్పిందే మేము చేశాం. ఈ సినిమా విషయంలో ఉన్న ఒకే ఒక్క చిన్న విచారం ఏంటంటే.. చరణ్‌ నేను కలిసి మొదటిసారి సినిమా చేశాం. అది హిట్‌ కాలేదు. ఒకవేళ భవిష్యత్తులో మేము మళ్లీ కలిసి పనిచేయాలనుకుంటే ఇంతటి జోష్‌ రాకపోవచ్చు. అంతకు మించి ఎలాంటి బాధ లేదు’’ అని చిరంజీవి వివరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version