ఇంకా ‘మా’ పెద్దరికం ఏముంది.. ఇంతలా అవమానిస్తారా : మెగాస్టార్

-

నేడు హైదరాబాద్ లోని మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ మీటింగ్ లో హీరో రాజశేఖర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తతం టాలీవుడ్ వర్గాల్లో ఎంతో వివాదాస్పదం అవుతున్నాయి. మీటింగ్ లో మెగాస్టార్ మాట్లాడుతున్న సమయంలో పలు మార్లు అడ్డుపడిన రాజశేఖర్, ఆ తరువాత సడన్ గా స్టేజ్ పైకి వచ్చి, అసోసియేషన్ లో గొడవలు జరుగుతున్నాయని, అయితే అటువంటివి చెప్పకుండా దాచి పెడుతున్నారని అన్నారు. అంతేకాక అసోసియేషన్ లో సమస్యల వల్ల తమ ఫ్యామిలీ లో గొడవలు జరుగుతున్నాయని,

అలానే తనకు కొద్దిరోజుల క్రితం జరిగిన యాక్సిడెంట్ కు కూడా అదే కారణం అని సంచలన వ్యాఖ్యలు చేసారు. అనంతరం మైక్ అందుకున్న మెగాస్టార్, రాజశేఖర్ ఈ విధంగా సభా మర్యాదను ఉల్లంఘించి వ్యాఖ్యానించడం సరైనది కాదని, అంతేగాక అసోసియేషన్ కు సంబంధించి మంచి విషయాలను బహిరంగంగా అందరిముందు బయటపెట్టండి, అలానే చెడు విషయాలు ఏమైనా ఉంటె చెవులో చెప్పండి అని పలు మార్లు ఇప్పటికే తాను చెప్పడం జరిగిందని అన్నారు. అయినప్పటికీ  కూడా స్టేజ్ మీద కూర్చుకున్న వారికి మర్యాద ఇవ్వకుండా రాజశేఖర్ చేసిన వ్యాఖ్యలు ఏ మాత్రం సమర్ధనీయం కాదని,

దీనిపై అసోసియేషన్ కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అలానే ఆయన ధోరణి చూస్తుంటే, కావాలనే గొడవ పెట్టుకోవాలనే ఉద్దేశ్యంతోనే ఇక్కడికి వచ్చినట్లు అర్ధం అవుతుందని, ఇటువంటి పరిస్థితుల్లో కూడా తాను స్పందించకపోతే ఇక్కడ ఈ హోదాలో తాను కూర్చోవడానికి అర్ధం ఉండదని చిరంజీవి అన్నారు. అనంతరం మోహన్ బాబు, మురళి మోహన్, కృష్ణంరాజు తదితరులు కూడా రాజశేఖర్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు….!!

Read more RELATED
Recommended to you

Exit mobile version