సచివాలయంలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో అడ్వాన్సులు తీసుకొని వాహనాలను సరఫరా చేయని డీలర్లపై క్రిమినల్ కేసుల నమోదు పై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. కేసుల నమోదుతో పాటు సీబీ సిఐడి తో దర్యాప్తుకు ఆదేశించారు రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున. ఎస్సీ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో 11వ కమిటీ ఆఫ్ పర్సన్స్ (సీఓపీ) సమావేశం నిర్వహించారు. అడ్వాన్స్‌లు తీసుకుని వాహనాలు సరఫరా చేయని డీలర్ల అంశం పై సమీక్ష చేశారు మంత్రి నాగార్జున.
టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇ-ఆటోలు, ట్రాక్టర్లు, మిషన్ డ్రెన్ క్లీనర్ల సరఫరా కోసం టెండర్లు పొందిన డీలర్లు.. అడ్వాన్స్ రూపంలో 46 కోట్ల రూపాయలను ప్రభుత్వం నుంచి తీసుకున్న డీలర్ల గురించి వివరాలు తెలుసుకున్నారు. కెనటిక్ గ్రీన్ ఎనర్జీ పవర్ సొల్యూషన్స్ (పూణే), వెంకటేశ్వరా ట్రేడర్స్ (తాడేపల్లి), ఈగల్ అగ్రిఎక్విప్ మెంట్స్ (కావలి), ఎంట్రాన్స్, ఆటోమోబైల్స్ (పెద్ద తాడేపల్లి) సంస్థలకు చెందిన డీలర్లుగా గుర్తించారు.