టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన పార్టీ నేత నాదెండ్ల మనోహర్‌లపై మంత్రి గుడివాడ అమర్నాథ్ సెటైర్లు వేశారు. ఇంతకీ అవేంటంటే.. వెన్నుపోట్లు పొడవడంలో చంద్రబాబు నాయుడు పెద్ద కట్టప్ప అయితే.. నాదెండ్ల మనోహర్ చిన్న కట్టప్ప అని అన్నారు. ఎన్టీఆర్‌కి చంద్రబాబు వెన్నపోటు పొడిస్తే.. పవన్ కల్యాణ్‌కి మనోహర్ వెన్నుపోటు పొడుస్తున్నారని ఆయన విమర్శించారు. అందుకే బాబును పెద్ద కట్టప్పతో, మనోహర్ని చిన్న కట్టప్పతో పోల్చారు. చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్టునే జనసేన నేత నాదెండ్ల మనోహర్ చదువుతున్నారని ఈ సందర్భంగా ఆయన విమర్శించారు. విశాఖపట్నంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
అంతే కాక, ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న పారిశ్రామిక అభివృద్ధిని చూసి ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయని అందుకే లేనిపోని విమర్శలు చేస్తున్నాయి అంటూ ఏపీ ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. విశాఖలో మీడియా సమావేశంలో మాట్లాడుతు..పెట్టుబడుల విషయంలో గుజరాత్ తరువాత తరువాత స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉందని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా పారిశ్రామిక వేత్తలు ఏపీ వైపు చూస్తున్నారని అన్నారు. పోలవరం ప్రాజెక్టును 70 శాతం కట్టామని చంద్రబాబు అంటున్నారు..కానీ చంద్రబాబు 70శాతం కట్టలేదు..70 శాతం కొట్టేశారు అంటూ ఎద్దేవా చేశారు.