మహారాష్ట్రలో కరోనా విలయం.. మరో మంత్రికీ పాజిటివ్‌..

-

రోజు రోజుకీ కరోనా కేసుల దేశంలో పెరుగతూ వస్తున్నాయి. మహారాష్ట్రలో కరోనా విలయ తాండవం చేస్తోంది. ఇప్పటికే దేశంలో అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్న మహారాష్ట్రలోనే. అయితే.. ఇప్పుడు వరుసగా రాజకీయ ప్రముఖులు కరోనా బారిన పడుతున్నారు. ఇటీవలే.. ఎన్సీపీ సీనియ‌ర్ నేత‌, ఉద్ధ‌వ్ థాక‌రే కేబినెట్‌లో పౌర స‌ర‌ఫ‌రాల శాఖ మంత్రిగా కొన‌సాగుతున్న చ‌గ‌న్ భుజ్‌బ‌ల్ తాజాగా క‌రోనా బారిన ప‌డ్డారు. ఇప్ప‌టికే ఆ పార్టీకి చెందిన కీల‌క నేత‌, మ‌హారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌కు క‌రోనా సోకినట్లు ఈ రోజు ప్రకటించారు. ప‌వార్‌కు కరోనా నిర్ధార‌ణ అయిన గంట‌ల వ్య‌వ‌ధిలోనే త‌న‌కు కూడా క‌రోనా సోకిందంటూ భుజ్‌బ‌ల్ ట్వీట్ చేయడం గమనార్హం. త‌న‌ను క‌లిసిన వారంతా ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌ని ఆయ‌న విజ్ఞ‌ప్తి చేశారు.

మ‌హారాష్ట్రలో రాజ‌కీయ సంక్షోభం నెల‌కొన్న వెంట‌నే ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి, శివ‌సేన చీఫ్ ఉద్ధ‌వ్ థాక‌రే త‌న‌కు క‌రోనా సోకింద‌ని ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. అయితే సంక్షోభం నివార‌ణ కోసం తీసుకుంటున్న చ‌ర్య‌ల్లో భాగంగా ఆయ‌న త‌ప్ప‌నిస‌రిగా ఆయా నేత‌ల‌తో భేటీ అవుతున్నారు. ఈ క్ర‌మంలో ఎన్సీపీ నేత‌ల‌తో పాటు కాంగ్రెస్ నేత‌లు కూడా ఆయ‌న‌తో భేటీ అయ్యారు. ఈ క్ర‌మంలోనే డిప్యూటీ సీఎం ప‌వార్‌కు క‌రోనా సోకింద‌న్న వాద‌న‌లు వినిపించాయి. తాజాగా భుజ్‌బ‌ల్‌కు కూడా కరోనా సోకడంతో ఆయన అనుచరులు, కుటుంబ సభ్యులు సైతం కరోనా పరీక్షలు చేయించుకుంటున్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version