ఆంధ్రప్రదేశ్ మంత్రి గుమ్మనూరు జయరాం భార్య రేణుకకు ఐటి శాఖ నోటీసులు జారీ చేసింది. అస్పరి మండలం చిన్న హుతురు, పెద్ద హుతురు భూముల కొనుగోలు పై ఐటి అధికారులు వివరణ కోరారు. ఈ నోటీసులపై మంత్రి జయరాం స్పందించారు. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం మంత్రి క్యాంప్ కార్యాలయంలో మంత్రి జయరాం మాట్లాడుతూ..
గత కొన్ని సంవత్సరాలుగా సర్పంచ్, జెడ్పి, రెండుసార్లు ఎమ్మెల్యేగా.. ప్రస్తుతం కార్మిక శాఖ మంత్రిగా పనిచేస్తున్నానని, తమ కుటుంబం 100 ఎకరాల ఆసామిగా జీవనం సాగిస్తున్నామని, అప్సరి మండలంలో కేవలం 52 లక్షల విలువ చేసే భూమిని తమ కుటుంబం కొనుగోలు చేసింది అనడంలో వాస్తవం లేదని స్పష్టం చేశారు. టిడిపి అసత్య ప్రచారాలు చేయడం, కొన్ని చానల్లో ప్రసారమవుతున్న అసత్య ఆరోపణలు మానుకోవాలని సూచించారు. ఐటీ అధికారుల నుంచి తమ కుటుంబానికి ఎలాంటి నోటీసులు అందలేదని, పొలం కొనుగోలు బినామీలు కాదని తమ కుటుంబ సభ్యులేనని తెలిపారు. 100 ఎకరాల ఆసామీ భూమి కొనుగోలు చేయడం తప్ప అని ప్రశ్నించారు.