ఆవో-దేఖో-సీకో అంటూ ప్రధానమంత్రి మోడీకి మంత్రి కేటీఆర్ లేఖ

-

ప్రధాని మోడీకి మంత్రి కేటీఆర్‌ లేఖ రాశారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల నేపథ్యంలో హైదరాబాద్‌కు విచ్చేస్తున్న మోడీకి వ్యంగ్యాస్ర్తాలు సంధిస్తూ.. మంత్రి కేటీఆర్‌ లేఖ రాశారు. ప్రధాని మోడీ … తెలంగాణ నుంచి పాఠాలు నేర్చుకోండని, ఆవో-దేఖో-సీకో (Aao-Dhekho-Seekho) అంటూ ప్రధానమంత్రి మోడీకి మంత్రి కేటీఆర్ లేఖ రాశారు.

జాతీయ కార్యవర్గ సమావేశాల్లో విద్వేష విభజన ఎజెండా కాకుండా అభివృద్ధి వికాసం గురించి మాట్లాడండి. పార్టీ డి.ఎన్.ఏ లోనే విద్వేషాన్ని, సంకుచిత్వం నింపుకున్న మీరు ప్రజలకు పనికొచ్చే విషయాలను ఈ సమావేశాల్లో చర్చిస్తారని అనుకోవడం అత్యాశే అని తెలుసు . వినూత్న పథకాలు, నూతన పరిపాలన విధానాలపై మాట్లాడే స్థాయికి ఎన్నడూ చేరుకోలేని మీ పార్టీ సమావేశాల రియల్ అజెండా విద్వేషం. అసలు సిద్ధాంతం విభజనే అని అందరికి తెలుసు . అబద్దాల పునాదులపై పాలన సాగిస్తున్న మీకు ఆత్మవిమర్శ చేసుకునే ధైర్యం ఉందని అనుకోవడం లేదు. అభివృద్ధి విషయంలో మీ పార్టీ నూతన ప్రారంభం చేయడానికి తెలంగాణకు మించిన ప్రదేశం ఇంకొకటి లేదని ఆయన లేఖలో పేర్కొన్నారు.

అంతేకాకుండా.. తెలంగాణ ప్రాజెక్టులు-పథకాలు-సుపరిపాలన విధానాలు ప్రాధాన్యతలను అధ్యయనం చేయండి. డబుల్ ఇంజిన్ తో ప్రజలకు ట్రబుల్ గా మారిన మీ రాష్ట్రాల్లో అమలుచేసేందుకు ప్రయత్నించండి. అద్భుతమైన తెలంగాణ గడ్డ నుంచి నూతన అలోచనా విధానానికి నాంది పలకండి. మత సామరస్యంతో కూడిన వసుదైక కుటుంబం లాంటి సమాజ నిర్మాణానికి ఆలోచన చేయండి- కొత్త ఆరంభం వైపు అడుగులు వేయండి. అంటూ విమర్శలు గుప్పించారు మంత్రి కేటీఆర్‌.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version