ఆ భూముల్లో మహిళా పెట్రోల్ బంకులు ఏర్పాటు చేస్తాం : సీతక్క

-

ఒక్కో మహిళా ప్రాంగణాన్ని ఒక్కో రంగంలో శిక్షణ కోసం ఉపయోగించాలి. మూస పద్ధతిలో కాకుండా అవకాశాలు, ప్రజల అవసరాలకు అనుగునంగా శిక్షణ కేంద్రాలను తీర్చిదిద్దాలి అని మంత్రి సీతక్క అన్నారు. జిల్లా ప్రాంగణాల్లో మహిళలకు ఆటో డ్రైవింగ్, కార్ డ్రైవింగ్ సెంటర్లు నెలకొల్పి ఉచితంగా శిక్షణ ఇస్తాం. మహిళా ప్రాంగణాలకి ప్రత్యేక బడ్జెట్ కేటాయిస్తాం. మహిళా స్వయం సహాయక బృందాలతో సమన్వయం చేసుకొని మహిళా కార్పొరేషన్ అధికారులు పనిచేయాలి.. అప్పుడే మహిళా అభివృద్ధి వేగవంతం అవుతుంది.

మహిళా కార్పొరేషన్, మహిళా సంఘాలు కలిసి పని చేస్తే కోటి మంది మహిళలు కోటీశ్వరులు కావడం సాధ్యపడుతుంది. మహిళా ప్రాంగణ భూముల్లో మహిళా పెట్రోల్ బంకులు ఏర్పాటు చేస్తాం. మహిళా ప్రాంగణాల్లోనీ శిక్షణ కేంద్రాల్లో మహిళా సంఘ సభ్యులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. టైలరింగ్, బ్యూటిషన్, ఫుడ్ ప్రాసేస్సింగ్, కంప్యూటర్ స్కిల్స్ వంటి రంగాల్లో మహిళలకు శిక్షణ ఇవ్వాలి. మహిళా ప్రాంగణంలో శిక్షణ తీసుకున్న మహిళా సంఘాలకు ప్రభుత్వo ఉపాధి మార్గాలను కల్పిస్తుంది అని సీతక్క పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version