కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష లీడర్ రాహుల్ గాంధీపై కేంద్రమంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి సీతక్క కౌంటర్ ఇచ్చారు. సచివాలయంలో సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ..రాహుల్ మతం,అభిమతం కులగణన అని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా కులగణన చేపట్టి జనాభా ప్రాతిపదికన సంక్షేమ ఫలాలు, రిజర్వేషన్లు కల్పించాలన్నదే ఆయన అభిమతమని వెల్లడించారు.
బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని సరిదిద్ది, న్యాయం చేయాలనే కులగణన కోసం ఆయన డిమాండ్ చేస్తున్నారన్నారు. దేశవ్యాప్తంగా బీసీ కులగలన చేయాలని పట్టుబట్టారని గుర్తుచేశారు.కులగణన అంశాన్ని పక్కదారి పట్టించేందుకు రాహుల్‌ని బీజేపీ నేతలు టార్గెట్ చేస్తున్నారని, త్యాగాల కుటుంబం నుంచి వచ్చిన ఆయన్ను ఎవరూ ఏమీ చేయలేరని విమర్శించారు.