Miss Universe Singapore 2021: సిక్కోలు చిన్న‌దానికి మిస్ సింగపూర్ కిరీటం !

-

Miss Universe Singapore 2021: తెలుగమ్మాయికి అరుదైన గౌర‌వం ద‌క్కింది. శ్రీ‌కాకుళం చెందిన నందిత బన్న(Banna Nandita) మిస్ యూనివర్స్ సింగపూర్-2021 కిరీటాన్ని దక్కించుకుంది. నేషనల్ మ్యూజియం సింగపూర్ ఈ పోటీలు జ‌రిగాయి. ఫైన‌ల్‌లో నందిత బన్న ఏడుగురు ఫైనలిస్టులతో పోటీ పడి అందాల కిరీటాన్ని కైవసం చేసుకుంది. ఈ పోటీకి సంబంధించిన ఫ‌లితాలు శుక్రవారం అర్ధరాత్రి వెల్లడ‌య్యాయి.

నందిత బ‌న్న‌.. ప‌క్కా తెలుగింటి అమ్మాయి. నందిత తల్లిదండ్రులు గోవర్థన్‌, మాధురి. వారి స్వస్థలం ఏపీలోని శ్రీకాకుళం జిల్లా.. కానీ 25 ఏండ్ల కిత్రమే సింగపూర్‌లో స్థిరపడ్డారు. ప్రస్తుతం సింగపూర్ మేనేజ్‌మెంట్ యూనివర్సిటీలో బిజినెస్ మేనేజ్‌మెంట్, ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ లో డిగ్రీ ఫైనలియర్‌ చేస్తుంది. కానీ మోడ‌లింగ్ పై ఆస‌క్తితో ఈ రంగంలోకి వ‌చ్చింది. ఇలా మిస్ యూనివర్స్ సింగ‌పూర్ గా నిలిచింది. అలాగే..డిసెంబర్ లో ఇజ్రాయెల్‌లోని ఐలాట్‌లో జరిగే మిస్ యూనివర్స్ 2021 పోటిల్లో నందిత బన్న సింగపూర్‌ నుంచి ప్రాతినిధ్యం వహించనుంది.

Read more RELATED
Recommended to you

Latest news