చంద్ర‌బాబు ఇప్పుడు గట్టిగా అరిస్తే గడ్డిపరక సింహం కాదు: ఎమ్మెల్యే రోజా

-

టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే రోజా మరోసారి అసెంబ్లీ వేదికపై విరుచుకుపడ్డారు. ఏపీ అసెంబ్లీలో చంద్రబాబునాయుడు ప్రతిపక్ష నేతగా కాకుండా పనికిమాలిన నాయకుడిగా మాట్లాడుతున్నారని వైసీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు. మ‌రియు చంద్రబాబు అసెంబ్లీలో మగధీర డైలాగులు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. ఒక్కొక్కరు కాదు వందమంది రండి అన్నట్టు 150 మందికి సమాధానం చెప్తా అంటున్నారని ఆయనపై సెటైర్ వేశారు. చంద్రబాబు ఇప్పుడు గట్టిగట్టిగా అరుస్తున్నారని…గట్టిగా అరిస్తే గడ్డిపరక సింహం కాదని విమర్శించారు. అదే విధంగా రోజా మాట్లాడుతూ, గత అసెంబ్లీలో తనకు ఎదురైన అనుభవాలను గుర్తు చేసుకున్నారు. చంద్రబాబుకు వయసు పెరిగే కొద్దీ చాదస్తం కూడా పెరుగుతోందని విమర్శలు గుప్పించారు.

కాల్ మనీ, సెక్స్ రాకెట్ ను తాను ప్రస్తావిస్తే, ‘కామ సీఎం’ అని తాను అన్నట్టు ఎల్లో మీడియాలో వార్తలు వేయించుకుని, తనను అన్యాయంగా సభ నుంచి సస్పెండ్ చేశారని ఆరోపించారు. తాను కోర్టుకు వెళ్లి, పోరాడి, సస్పెన్షన్ ఎత్తివేతపై ఆదేశాలు తెచ్చుకున్నా సభలోకి రానివ్వలేదని గుర్తు చేశారు. ఆనాడు మార్షల్స్ తో తనను బలవంతంగా గెంటించారని, నాడు తనకు గాయాలు అయ్యాయని, ఆ వీడియోను చూపిస్తానని అన్నారు. నాడు ప్రజా సమస్యలపై తాను మాట్లాడితే, ఏడాది పాటు సస్పెండ్ చేశారని, ఇప్పుడు చంద్రబాబు మాట్లాడుతున్న మాటలు దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉన్నాయని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version