సీఎం జగన్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన శ్రీశైలం ఎమ్మెల్యే

-

ఏపీలో వైసీపీ ప్లీనరీ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ నేపథ్యంలో.. నంద్యాల జిల్లా ఆత్మకూరులో నిన్న నిర్వహించిన శ్రీశైలం నియోజకవర్గ వైసీపీ ప్లీనరీలో శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి సీఎం జగన్‌పై ఆసక్తికర వ్యాఖ్యాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంక్షేమ పథకాల నడి సముద్రంలో చిక్కుకున్నారని, ఆయనను మీరే రక్షించి ఒడ్డుకు చేర్చాలని ప్రజలను కోరారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను చూసి మహిళలు తమకే ఓటు వేస్తారని అన్నారు శిల్పా చక్రపాణిరెడ్డి.

భర్తలు వద్దన్నా వారి భార్యలు మాత్రం తమకు ఓట్లేసి గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు శిల్పా చక్రపాణిరెడ్డి. సోషల్ మీడియాలో వైసీపీకి వ్యతిరేకంగా పోస్టులు వస్తే అదే స్థాయిలో మీరు కూడా పోస్టులు పెట్టాలని కార్యకర్తలకు చక్రపాణిరెడ్డి సూచించారు. బీజేపీ విధానాల వల్లే పెట్రోలు, గ్యాస్, నిత్యావసరాల ధరలు పెరిగాయని, అయినప్పటికీ ప్రతిపక్షాలు ఆ పార్టీని ఏమీ అనకుండా తమపై విమర్శలు చేస్తున్నాయని మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version