ఏపీ లో ఇటీవల 5 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కావడంతో ఆ ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేయడానికి నిర్ణయించారు. ఈ క్రమంలో కూటమి పార్టీల నుంచి కూడా ఈ ఐదుగురు ఎమ్మెల్సీలను నియమించడానికి రంగం సిద్ధం చేశారు. ఈ తరుణంలో జనసేన పార్టీ నుంచి మెగా బ్రదర్ కొణిదెల నాగబాబు-పేరును డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే నాగబాబు పేరును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అధికారికంగా ప్రకటించడంతో అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు నాగబాబుకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం పై సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఈ నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శలు గుప్పించారు. పవన్ కళ్యాణ్ సోదరుడు
నాగబాబుకు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఇవ్వడాన్ని సోషల్ మీడియా వేదికగా అంబటి రాంబాబు
తప్పుబట్టారు. “అన్నను దొడ్డిదారిన మంత్రివర్గంలోకి తీసుకురావడంలో ఘన విజయం సాధించిన
తమ్ముడికి శుభాకాంక్షలు” అని ట్వీట్టర్ లో పేర్కొన్నారు.