చెత్త ఏరిన ప్రధాని మోదీ.. వైరల్ అవుతున్న వీడియో

-

భారత ప్రధాన మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత నరేంద్ర మోడీ చేపట్టిన అత్యంత ప్రజాదరణ లభించిన పధకాల్లో స్వచ్ఛభారత్ ఒకటి. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునే దిశగా ప్రారంభించిన ఈ పథకం దేశంలో పలు విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. ఈ పథకం అమలు పట్ల మోదీ సర్కారు కూడా కీలక శ్రద్ధ పెట్టింది. ఈ పథకానికి మోడీ ఎంతగా ప్రాధాన్యమిస్తున్నారు అన్న విషయాన్ని చెప్పేందుకు ఆదివారం ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది.

ప్రధాని నరేంద్ర మోడీ
ప్రధాని నరేంద్ర మోడీ

దేశరాజధాని ఢిల్లీలో రూ. 920 కోట్లతో కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన ప్రగతి మైదాన్ ఇంటిగ్రేటెడ్ ట్రాన్సిట్ కారిడార్ ను ప్రారంభించేందుకు ఆదివారం ఉదయం ప్రధాని మోదీ ఆ ప్రాంతానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా కొత్త నిర్మాణాన్ని పరిశీలించేందుకు ఒంటరిగా కారిడార్ లోకి ప్రవేశించిన మోడీ.. అక్కడ కనిపించిన చిన్న చిన్న పెంకులను ఆయన స్వయంగా వంగి మరీ తన చేతులతో తీశారు. ఆ తర్వాత అటుగా నడుస్తూ కారిడార్ గోడకు ఆనుకొని పడిపోయిన ఓ కూల్ డ్రింక్ బాటిల్ ను కూడా మోదీ తన చేతులతో తీశారు. ఈ దృశ్యాల కు చెందిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version