ఆ నోటీసులు ఇల్లీగల్.. ఇక నేనే ప్రెసిడెంట్ : అజారుద్దీన్

-

అపెక్స్ కమిటీ ఇచ్చిన నోటీసులపై అజారుద్దీన్ ఫైర్ అయ్యారు. ప్రెసిడెంట్ లేకుండా మీటింగ్ లు పెట్టుకున్నారు…ఎలా పెట్టుకుంటారని.. తనకు ఇచ్చిన నోటీసులు ఇల్లీగల్ అని కౌంటర్ ఇచ్చారు. అంబుడ్స్ మన్ నియామకం సరైనదేనని హైకోర్ట్ కూడా చెప్పిందని.. కానీ హెచ్ సీఏలో ఉన్న ఒక వర్గం వ్యతిరేకిస్తోందన్నారు. 25 ఏళ్లుగా అదే వ్యక్తులు ఎందుకు హెచ్ సీఏలో ఉన్నారని మండిపడ్డారు. ఎవరినీ రానివ్వరు…వచ్చినా ఉండనివ్వరు…. బ్లాక్ మెయిల్ చేస్తారని ఆరోపణలు చేశారు. వాళ్ళ అవినీతికి నేను అడ్డొస్తున్నాను అనే… నాపై కుట్రలు చేస్తున్నారని.. క్రికెట్ అంటే తెలిసిన వాళ్ళు కమిటీలో లేరని చురకలు అంటించారు. నాకు క్రికెట్ అంటే ప్రేమ… క్రికెట్ ని అభివృద్ధి చేయాలన్నదే నా లక్ష్యమన్నారు. ఉప్పల్ గ్రౌండ్ పరిస్థితి దారుణంగా ఉందని.. తాను అధ్యక్షుడుగా అయినప్పుడు కనీస వసతులు లేవన్నారు.

మరి ఇన్నేళ్లు…హెచ్ సీఏలో ఉండి ఏం అభివృద్ధి చేశారని అపెక్స్ కమిటీ సభ్యులపై విరుచుకుపడ్డారు. హెచ్ సీఏలో ఏం జరుగుతుందో… బీసీసీఐకి అన్నీ తెలుసు అని.. ఈ విషయంపై తాను కూడా బీసీసీఐకి వివరిస్తానని హెచ్చరించారు. ప్రస్తుతం తానే ప్రెసిడెంట్ అని.. తనకు అన్ని రకాల పవర్స్ ఉన్నాయన్నారు. అపెక్స్ కౌన్సిల్ సభ్యులకు ఇప్పటికే.. అంబుడ్స్ మన్ నుంచి నోటీసులు వెళ్లాయని.. బోర్డ్ తో మాట్లాడి…హెచ్ సీఏ బాడీని డిసాల్వ్ చేస్తానని హెచ్చరించారు అజారుద్దీన్.

Read more RELATED
Recommended to you

Exit mobile version