తెలంగాణ రైతులకు శుభవార్త..ధాన్యం కొనుగోలు చేసిన 2 రోజులకే ఖాతాల్లో డబ్బులు

-

తెలంగాణ రైతులకు మంత్రి హరీష్ రావు తీపికబురు చెప్పారు. సిద్దిపేట నంగునూర్ (మం) సిద్దన్నపేట మార్కెట్ యార్డ్ లో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు మంత్రి హరీష్ రావు, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు చేసిన 2 రోజుల్లో రైతుల ఖతాల్లో డబ్బులు జమ చేస్తామని ప్రకటించారు.

క్వింటాల్‌ కు రూ. 2060 గా ధర నిర్ణయించినట్లు పేర్కొన్నారు మంత్రి హరీష్ రావు. ఢిల్లీలోని బీజేపి ప్రభుత్వం వడ్లు కొనమంటే కొంటలేదని.. నూకలు బుక్కమని ఉచిత సలహా ఇస్తుందని ఆగ్రహించారు. లక్ష మెట్రిక్ టన్నుల వరి ధాన్యం తెలంగాణలో పండుతున్నాయని.. దేశానికి అన్నం పెట్టే ధాన్యగారంగా తెలంగాణ మారిందని తెలిపారు. బీజేపీ బోర్ బావుల వద్ద మీటర్లు పెట్టమని చెపితే పెట్టలేదు.. మీటర్లు పెట్టలేదని 30వేల కోట్ల రూపాయలు ఇవ్వడం లేదన్నారు మంత్రి హరీష్ రావు. FCI నుంచి రావాల్సిన డబ్బులు రాకున్నా వరి ధాన్యాన్ని రాష్ట్రం కొంటుందన్నారు మంత్రి హరీష్ రావు.

Read more RELATED
Recommended to you

Exit mobile version