జగన్ సొంత జిల్లాలో రెచ్చిపోతున్న కరోనా…!

-

నిన్న ఒక్కరోజే కడప జిల్లాలో 15 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో అధికారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. కడప నగరమంతా బఫర్‌జోన్‌ పరిధిలోకి వస్తుందని అధికారులు తెలిపారు. కడపలోని సాయిపేట, అబ్దుల్‌ నబీ స్ట్రీట్, అలంఖాన్‌ పల్లెలకు సంబంధించి నుంచి మూడు కిలోమీటర్ల పరిధిలో కోర్‌జోన్‌గానూ, కోర్‌జోన్‌ల నుంచి ఐదు కిలోమీటర్ల మేరకు బఫర్‌జోన్‌లను ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు.

ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రజలు వీధుల్లో తిరగరాదని స్పష్టం చేశారు. కలెక్టర్ పులివెందుల రోడ్డులోని ఫాతిమా మెడికల్‌ కళాశాలలో కోవిడ్‌ ఆస్పత్రిని సందర్శించి అక్కడి వసతులపై ఆరా తీశారు. అయితే బుధవారం ఒక్కరోజే రాష్ట్రంలో అన్ని జిల్లా కంటే ఎక్కువ కేసులు కడపలో నమోదయ్యాయి. వీరిలో కొందరు ఢిల్లీలోని నిజాముద్ధీన్‌ ప్రార్థనలకు వెళ్లినట్లు అధికారులు గుర్తించారు. మొత్తం ఈ జిల్లా నుంచి 86 మంది ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లారని తెలిసింది. ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లిన కొందరికి కరోనా పాజిటివ్‌ రావడంతో వారు ఎవరెవరిని కలిసారని వారిపై అధికారులు దృష్టి పెట్టారు.

కరోనా పాజిటివ్‌ ఉన్న వారితో ప్రైమరీ కంట్రాక్టు వారికి కూడా ఫాతిమా మెడికల్‌ కళాశాలలో చికిత్స అందిస్తున్నారు. కరోనా సోకిన వ్యక్తులున్న ప్రాంతాలను కంటోన్మెంట్‌ జోన్‌గా ప్రకటించారు. కరోనా పాజిటివ్‌ ఉన్న వ్యక్తి ప్రాంతం కేంద్రంగా మూడు నుంచి ఎనిమిది కిలోమీటర్ల రేడియేషన్‌లో రాకపోకలు నిషేధించారు. మూడుకిలోమీటర్ల పరిధిలో ఉన్నవారికి నిత్యావసరాలను డోర్‌డెలివరీ ద్వారా అందించేందుకు నిర్ణయించారు. కడప నగరానికి చెందిన నలుగురు, ప్రొద్దుటూరు పట్టణంలో ఏడుగురు, వేంపల్లిలో ఇద్దరు, బద్వేలు, పులివెందుల ప్రాంతాలకు చెందిన ఒక్కొక్కరికి కరోనా వైరస్ సోకింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version