ఈటలపై మోత్కుపల్లి ఫైర్ : ముక్కు నేలకు రాయాల్సిందే

-

ఈటల రాజేందర్ పై మోత్కుపల్లి నర్సింహులు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈటెల రాజేందర్ బావమరిది దళితులపై చేసిన వ్యాఖ్యలకు ఈటెల రాజేందర్ ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పాలని మోత్కుపల్లి డిమాండ్ చేశారు. ఈటెల ఆక్రమించిన దళితుల భూముల్లో జెండాలు పాతుతామని హెచ్చరించారు.

రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి దళిత బంధుకు మద్దతుగా ప్రచారం చేస్తానని… ఈటెల మోసాలపై ప్రజల్లో చైతన్యం తీసుకు వస్తానని మోత్కుపల్లి సవాల్ విసిరారు. ఇప్పటికైనా ఈటెల రాజేందర్ దళితుల భూమిని వాపస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు మోత్కుపల్లి. దళిత బంధును అడ్డుకోవడం సరికాదని.. కేసీఆర్ ను అందరూ బలపర్చాలన్నారు.

ఈ పథకం గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్న వారికి గ్రామాల్లో తగిన గుణపాఠం చెప్పాలని పేర్కొన్నారు.ఒక దళితునికి పది లక్షల ఇస్తానని చెప్పిన దేశంలో ఏకైక మొనగాడు కేసీఆర్ అని కొనియాడారు. రాజగోపాల్ రెడ్డికి దమ్ముదైర్యం ఉంటే రాజీనామా చేయాలని… దళిత పథకాలకు గండి కొట్టే ప్రయత్నం చేస్తున్నారని నిప్పులు చెరిగారు. రైతుబందులాగా దళిత బంధు మంచి పథకమన్నారు. అట్టడుగు వర్గాల వారికి ఈ పథకం అన్ని రకాలుగా ఉపయోగ పడుతుందని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version