అందువల్లే నా బాయ్ ఫ్రెండ్ నాకు బ్రేకప్ చెప్పాడు… మృణాళిని ఠాకూర్..!

-

అందాల ముద్దుగుమ్మ మృణాళినీ ఠాగూర్ గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ అనేక సీరియల్ లలో నటించే మంచి పాపులారిటీని సంపాదించుకుంది. అయితే ఆ తర్వాత హృతిక్ రోషన్ హీరోగా తెరకెక్కిన 30 అనే సినిమాలో హీరోయిన్ గా కనిపించి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది.

ఈ సినిమా మంచి విజయం సాధించడంతో మృణాళిని ఠాకూర్ కు మంచి సినిమా అవకాశాలు దక్కాయి.ప్రస్తుతం మృణాలిని ఠాగూర్, షాహిద్ కపూర్ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న హిందీ ‘జెర్సీ’ సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తోంది. మరికొన్ని రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మృణాళిని ఠాకూర్ తన వ్యక్తిగత జీవితం గురించి పలు ఆసక్తికర విషయాలను బయటపెట్టింది. మృణాళిని ఠాకూర్ మాట్లాడుతూ… తన వ్యక్తిగత జీవితంలో చాలా సమస్యలను ఎదుర్కొన్నాను అని తెలియజేసింది. అలాగే ఏడు నెలల క్రితం తనకు బ్రేకప్ జరిగింది అని, తాను ప్రేమించిన వ్యక్తి సంప్రదాయ కుటుంబానికి చెందిన వాడని మృణాళిని ఠాగూర్ తెలియజేసింది.

కట్టుబాట్లు, పద్ధతులు చాలా ఎక్కువగా ఫాలో అవుతాడు అని తామిద్దరం ఒకరి నొకరు ఇష్టపడ్డాము అని నేను సినిమాల్లో నటిస్తాను అని తెలిశాక నన్ను వదిలిపెట్టి పోయాడు అని మృణాల్ ఠాకూర్ చెప్పుకొచ్చింది.తను విడిచి పెట్టి పోయినందుకు కూడా అతనిపై ఎలాంటి కోపం లేదు అని మృణాళిని ఠాగూర్ చెప్పుకొచ్చింది.

ఇప్పుడు సర్దిచెప్పుకుని పెళ్లి చేసుకున్న ఆ తరవాత ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడం తప్పవని మృణాళిని ఠాకూర్ చెప్పుకొచ్చింది. తమకు పెళ్లై.. పిల్లలు పుట్టిన తర్వాత.. వారిని పెంచే క్రమంలో గొడవలు రావొచ్చని.. అందుకే తన బ్రేకప్ గురించి తాను ఎక్కువగా ఆలోచించడం లేదని మృణాళిని ఠాకూర్ తెలిపింది.

అలాగే మృణాళిని ఠాకూర్ కెరియర్ పరంగా ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుకుంటున్నట్లుగా తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news